ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రేపు జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి

రేపు జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్
జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ఈ నెల 26వ తేదీన సోమ‌వారం జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌ర‌గ‌నుంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి రెండు ల‌క్ష‌ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచామని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 45 ఏళ్లు దాటిన వారికి మొద‌టి డోసుతో పాటు, తొలి డోసు తీసుకొని 84 రోజులు అయిన వారికి రెండో డోసు టీకాలు వేయ‌నున్న‌ట్లు జేసీ తెలిపారు. జిల్లాలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో ఇంకా నాలుగు ల‌క్ష‌ల మంది మొద‌టి డోసు తీసుకోవాల్సి ఉంద‌ని, అదే విధంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారు 40 వేల మంది ఉన్నార‌ని వీరంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. గ‌ర్భిణీ స్త్రీల‌కు, ఉపాధ్యాయుల‌కు కూడా మొదటి డోసు పంపిణీ చేయ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (డి) కీర్తి చేకూరి తెలిపారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు