ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

బొజ్జిగుప్ప కూడలిలో నిషేధిత గంజాయి పట్టివేత

ఎటపాకలో 390 కేజీల గంజాయి పట్టివేత
– పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
– గంజాయి విలువ సుమారుగా రూ.12 లక్షలు
– ఎటపాక ఎస్సై జ్వాలాసాగర్ వివరాలు వెల్లడి

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠా ఆదివారం సాయంత్రం ఎటపాక పోలీసులకు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎటపాక ఎస్సై జ్వాలాసాగర్ ఆదివారం సాయంత్రం తమ సిబ్బందితో మండల పరిధిలోని బొజ్జిగుప్ప కూడలి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ వాహనాల తనిఖీలలో ఎం.హెచ్.25.ఏజె.3225 నెంబర్ గల గూడ్స్ వాహనంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తూ కనిపించగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వాహనాన్ని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 390 కేజీల బరువు గల ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను ఎటపాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎటపాక ఎస్సై జ్వాలాసాగర్ వివరాలు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.11లక్షల 70 వేలు ఉంటుందని ఎస్సై తెలిపారు. ఇద్దరు నిందితులను విచారించగా వీరు ఒస్మానాబాద్ జిల్లా మహారాష్ట్రకు చెందినవారుగా తెలిపారు. వీరు ఈ నిషేధిత గంజాయిని సీలేరు నుండి మహారాష్ట్రకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఇరువురుపై ఎన్‌డి‌పి‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుందన్నారు. అంతరాష్ట్ర సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని , నిషేదిత వస్తువులయిన గంజాయి మరియు మరే ఇతర వస్తువులను తరలించినా వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్వాలాసాగర్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు