ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

10 కేజీల గంజాయితో నలుగురు వ్యక్తులు అరెస్ట్

10 కేజీల గంజాయితో నలుగురు వ్యక్తులు అరెస్ట్

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

మండలంలోని రాజవొమ్మంగి సర్కిల్ పరిధిలోని జడ్డంగి గ్రామ శివారులో జడ్డంగి పోలీసులు గురువారం  మధ్యాహ్నం జరిపిన వాహన తనిఖీ లో  20 వేల విలువైన పది కేజీల గంజాయి, యాక్టివా మోటార్ బైక్ స్వాధీనపరచుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగ దుర్గారావు తెలిపారు.  జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు,  రంపచోడవరం ఇన్చార్జి డి.ఎస్.పి ఎస్  రాంబాబు ఆదేశాల మేరకు  స్థానిక సిఐ ఎం నాగ దుర్గారావు పర్యవేక్షణలో ఎస్ ఐ  రాజేష్ సిబ్బందితో వెళ్లి గ్రామ శివారు మడేరు వాగు సమీపం ఆర్ అండ్ బి రోడ్ లో వాహన తనిఖీలు చేపడుతుండగా పట్టుబడిన సారా వీర వెంకట సుబ్రహ్మణ్యం, ముమ్మిడి సాయి ల ను విచారించగా  వారుఇచ్చిన సమాచారంతో  లబ్బర్తి జంక్షన్ వద్ద కడియాల వీర వెంకట సత్య సాయి,నందం లోకేష్ లను అదుపులోకి తీసుకొని గ్రే కలర్ యాక్టివా స్కూటర్,  10కేజీల గంజాయి2 మొబైల్ ఫోన్లు, 520 రూ నగదు,డిప్యూటీ తాసిల్దార్ అల్లి సత్యనారాయణ, మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం  చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని కాకినాడకు చెందిన ఈ నలుగురు  నిందితులు గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం పరిసర అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వద్దనుండి   కొనుగోలు చేసి కాకినాడలో అధిక ధరలకు విక్రయించడానికి తీసుకొని  వెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. దీనిపై జడ్డంగి పోలీస్ స్టేషన్ నందు   క్రైమ్ నెంబర్ 66/2021  యు /ఎస్8(సి)  ఆర్/డబ్ల్యు 20(బి)(ii)(బి)  ఆఫ్  యన్
డి.పి.ఎస్   యాక్ట్1985 గా కేసు నమోదు చేయద మైనదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్ ఐ  లు లంకా రాజేశ్,  టి గోపి నరేంద్ర ప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ సి‌హెచ్ బాబూరావు, వి. వి. వి.ఆర్. కిషోర్, కానిస్టేబుల్స్ పి.వి.రమణ,  కే. శ్రీనివాస్, ఆర్. దుర్గారావు,
సి హెచ్ డి ప్రసాద్ రెడ్డి లను  జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు