ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

అంగన్వాడీ పాల అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు

అంగన్వాడీ పాల సరఫరా అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు

– దళిత సంక్షేమ సంఘం , బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

విలీన మండలాల్లో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అద్దె గృహాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని అంగన్వాడీ పాల సరఫరాలో అవినీతి , అక్రమాలకు పాల్పడుతున్న గుత్తేదారుపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంక్షేమ సంఘం మరియు బహుజన సమాజ్ వాది పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం తూ.గో జిల్లా కలెక్టర్ సి.హెచ్.హరికిరణ్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్ ను దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా.పిచ్చయ్య మరియు బహుజన సమాజ్ పార్టీ ఎటపాక మండల నాయకులు , లీగల్ అడ్వైజర్ అవులూరి.సత్యనారాయణ సంయుక్తంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చేవూరి.హరికిరణ్ సానుకూలంగా స్పందించినట్టు వారిరువురు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా.పిచ్చయ్య మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు , లీగల్ అడ్వైజర్ అవులూరి.సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి అవినీతి , అక్రమాలు జరిగినా సహించేది లేదన్నారు. అటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేలా ఎటువంటి పోరాటం చేయటానికైనా తాము సిద్ధమని పేర్కొన్నారు. ఇటీవల అంగన్వాడీల ద్వారా పసి పిల్లలు , బాలింతలు , గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం వారు వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఉచితంగా అందిస్తున్న పాలను దొడ్డిదారిన అమ్ముకొని సొమ్ము చేసుకోవడం సిగ్గుచేటన్నారు. అటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నాయకులు ముద్దా.పిచ్చయ్య , అవులూరి.సత్యనారాయణ కోరారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు