ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

పాస్టర్లకు జి.టి.ఎస్.ఎస్.ఎస్ నిత్యావసర సరుకుల పంపిణీ

ఎటపాక మండల 89 పాస్టర్ల కుటుంబాలకు చేయూత
– జి.టి.యస్.యస్.యస్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేత

– ముఖ్య అతిధిగా ఎటపాక ఎస్సై చినబాబు

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

జి.టి.యస్.యస్.యస్ సొసైటీ – ఖమ్మం వారి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలోని 89 పాస్టర్స్ కుటుంబాలకు బియ్యం , కందిపప్పు , పంచదార , గోధుమ పిండి , సాల్టు , ఆయిల్ తదితర నిత్యవసర సరుకులు తోటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎటపాక ఎస్సై చినబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై చినబాబు మాట్లాడుతూ జి.టి.యస్.యస్.యస్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా పాస్టర్స్ కుటుంబాలకు ఎంతో అవసరమని , ఇది హర్షించదగిన విషయమని కొనియాడారు. ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ అధ్యక్షులు బిషప్ ఎం.జాకబ్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏజెన్సీ ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. జి.టి.యస్.యస్.యస్ సొసైటీ వారు అందించిన నిత్యావసర సరుకులను మండల పాస్టర్లు కోవిడ్ నిబంధనలు పాటించి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఇర్ప.ఏసుబాబు , ఉయిక.పీటర్ సింగయ్య , ఎం.సత్యనారాయణ , జె.భీమయ్య , డి.యేసుదాస్ , పి.కనకరాజ్ , అకుల , ఉబ్బా.యోహాను , సంస్థ ప్రతినిధులు , సెక్షన్ ఇంచార్జ్ ఆర్.రామారావు , పాస్టర్.శామ్యుల్ , జె.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు