ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

గంజాయి  తరలిస్తున్న ఇరువురు వ్యక్తుల అరెస్టు- సీఐ ఎం నాగ దుర్గారావు

గంజాయి  తరలిస్తున్న ఇరువురు వ్యక్తుల అరెస్టు- సీఐ ఎం నాగ దుర్గారావు

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

మండలంలోని జడ్డంగి గ్రామ శివారు న  పోలీసులు జరిపిన వాహన తనిఖీ లో గంజాయి తరలిస్తున్న ఇరువురు వ్యక్తులు పట్టుబడినట్లు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగ దుర్గారావు తెలిపారు.   జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు,   రంపచోడవరం ఐ సి, కాకినాడ డి ఎస్ పి ఎస్ రాంబాబు, స్థానిక సీఐ ఎం నాగ దుర్గారావు  ఆధ్వర్యంలో  రాజవొమ్మంగి ఎస్ఐ , జడ్డంగి ఇంచార్జ్   టి గోపి నరేంద్ర ప్రసాద్  సిబ్బందితో వెళ్లి  జడ్డంగిగ్రామ శివారు మడేరు వాగు సమీపంలో నర్సీపట్నం నుండి ఏలేశ్వరం వైపు వెళ్లే జాతీయ రహదారి వద్ద  ఇరువురు వ్యక్తులు మోటార్ బైక్ పై  10 వేల విలువైన ఐదు కేజీలు  గంజాయి తరలిస్తుండగా  పట్టుకున్నా మన్నారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, 200 నగదు తాసిల్దార్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు  సీఐ తెలిపారు. జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన ఆవిడి శివ ప్రసాద్, రెడ్డి రాజేష్ లు విశాఖ జిల్లా చింతపల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక రేట్లకు విక్రయించడానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.   నిందితులపై యన్ డి పి ఎస్ఆక్ట్1985 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్ ఐ గోపి నరేంద్ర ప్రసాద్,  పి వి రమణ ,ప్రసన్న రాజు, శ్రీనివాస్, సి హెచ్ డి ప్రసాద్ రెడ్డి లను జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు