ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఎటపాకలో ముగ్గురు నకిలీ మావోయిస్టులు అరెస్ట్

ముగ్గురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్
– నకిలీ మావోయిస్టుల బెదిరింపులకు భయపడవద్దు
– ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారు
– చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ వివరాలు వెల్లడి

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు ఆదేశాలు మేరకు ముగ్గురు నకిలి మావోయిస్టులను ఎటపాక పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. గత రెండు నెలలుగా మన్యంలోని ఎటపాక పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల పేరుతో లెటర్లు , ఫోన్ కాల్స్ ద్వారా పురుగు మందుల షాపుల వద్ద మావోయిస్టు కమిటీకి చెందిన కరపత్రాలు వదిలి షాప్ నిర్వాహకులను బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటపాక పోలీస్ స్టేషన్లో చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలు మేరకు చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ , ఇంఛార్జి డిఎస్పీ మురళీమోహన్ పర్యవేక్షణలో ఎటపాక సిఐ ఎం.గజేంద్రకుమార్ , ఎస్సైలు జ్వాలాసాగర్ , చినబాబు మరియు కరప ఎస్సై రమేష్ సంయుక్తంగా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఈ క్రమంలో ఏఎస్పీ ఆదేశాలు మేరకు నెల్లిపాక వద్ద ఎటపాక సిఐ ఎం.గజేంద్రకుమార్ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కూనవరం వైపు నుండి భద్రాచలం వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరారీ అవుతుండగా చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశామన్నారు. విచారించగా నకిలీ మావోయిస్టులుగా గుర్తించామన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం దొమ్మేడు గ్రామానికి చెందిన బి.వెంకటేష్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పల్లి గ్రామానికి చెందిన ఎస్.ప్రసాద్ మరియు ఎటపాక మండలం రాయనపేట గ్రామానికి చెందిన కె.వీరబాబుగా పోలీసులు గుర్తించారు. వీరు తోటపల్లి , లక్ష్మీపురం గ్రామాల్లో కొంతమంది పురుగు మందుల వ్యాపారస్తులను బెదిరించి రూ.50 వేలు వసూలు చేసినట్టు నిందితులు అంగీకరించిట్టు ఏఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఈ కేసులో భాగంగా వారి వద్ద నుంచి రూ.2280 నగదు , మోటర్ సైకిల్ , సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. అంతేకాకుండా వీరివద్ద భారతీయ కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ (సీపీఐఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఎర్రటి అక్షరాలతో రాసిన రెండు ఖాళీ కరపత్రాలు దొరికాయన్నారు. బోడా.వెంకటేష్ అనే వ్యక్తిపై ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ , ఇంఛార్జి డిఎస్పీ మురళీమోహన్ , ఎటపాక సిఐ ఎం.గజేంద్రకుమార్ , ఎస్సైలు జ్వాలాసాగర్ , చినబాబు మరియు కరప ఎస్సై రమేష్ , కానిస్టేబుల్ సత్తిబాబును జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు అభినందించారు. మావోయిస్టులమని చెప్పి నకిలీ మావోయిస్టులుగా చెలామణి అవుతున్న వారి బెదిరింపులకు భయపడి ప్రజలు కష్ట పడిన సొమ్ము వృధా చేసుకోవద్దని , ఇటువంటివి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని , పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటారని చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎటపాక సిఐ ఎం.గజేంద్రకుమార్ , చింతూరు సిఐ యువకుమార్ , ఎస్సైలు సాగర్ , చినబాబు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు