ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

వాళ్లు భూములు దానం చేస్తే మీరు లాగేసుకుంటున్నారు

అశోక్ గజపతి రాజు భూములు  భూములు దానం చేస్తే  వైస్సార్సీపీ వాళ్ళు లాగేసుకుంటున్నారు

వైజాగ్ భూములు విషయం లో విజయసాయిరెడ్డి బెదిరించి మరి భూములు లాక్కుంటున్నారు

అమలాపురం తెలుగుదేశం పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు విజయసాయిరెడ్డి చేసే భూకబ్జాలపై తీవ్రంగా మండిపడ్డారు.

Ravulapalem, విశ్వం వాయిస్ న్యూస్:

*ఆ కుటుంబం భూములు దానం చేస్తే.. విజయసాయి లాక్కున్నారు: సతీష్ రాజు* లక్షల కుటుంబాలకు భూదానం చేసిన చరిత్ర కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబానిదైతే…మెడమీద కత్తులు పెట్టి వేల మంది నుంచి భూములు గుంజుకున్న చరిత్ర ఎంపీ విజయసాయి రెడ్డిదని

అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు దుయ్యబట్టారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్న

కోపాన్ని విజయసాయి ఉత్తరాంధ్ర పై చూపిస్తున్నారని మండిపడ్డారు. ‘తనకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ఎక్కువ విలువిస్తున్నారనేది విజయసాయి ఆవేదన. మీపంపకాల్లో వచ్చిన తేడాలకు ఉత్తరాంధ్ర ప్రజల ఏం చేస్తారు? సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూములు కాజేసేందుకు అశోక్ గజపతిరాజు అడ్డుగా ఉన్నారనే ఆయనపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. సింహాచలం భూముల్లో అక్రమాలు జరిగితే 28 నెలలుగా విచారణ చేయించకుండా ఏం చేస్తున్నారు? చేతనైతే అన్యాక్రాంతమైన భూముల వివరాలు బయట పెట్టండన్నారు రామతీర్ధంలో విజయసాయిరెడ్డిని చెప్పులతో కొట్టారనిగుర్తు చేశారు. ‘అశోక్ గజపతి రాజు వస్తే ప్రధానమంత్రి లేచి నిలబడ్డారు. . ఆయనకు అంత గౌరవం ఇస్తారు. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే కుటుంబం గజపతి రాజు గారిది. వ్యక్తులను, సంస్థలను గుర్తించలేకపోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. సేవాభావంతో పని చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ పట్ల వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. దొంగే దొంగ

అన్నట్లుగా మాన్సాస్, సింహాచలం భూములపై ఆడిటింగ్ చేయడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనం అన్నారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను, మనోభావాలను పట్టించుకోకుండా

రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో దేవాలయాలను ధ్వంసం చేస్తూ భూములను ఆక్రమిస్తోంది మీరు కాదా? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు? పైడితల్లి

సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయులనుఅవమానించారు. మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన మహారాజ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించి చతికలపడ్డారు. తరచూ రాజకుటుంబీకులపై అవాకులు చవాకులుపేలితే చూస్తూ ఊరుకోం’ అని సతీష్ రాజు హెచ్చరించారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు