ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

వినాయకచవితి ఉత్సవాలు ఇళ్లలోనే…..

వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లలోనే…………………
– బహిరంగ స్థలాల్లో విగ్రహాలు , ఊరేగింపులు నిషేధం
– ఎటపాక ఎస్సై చినబాబు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి ఆదేశాలు మేరకు ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలను తమ ఇళ్లకే పరిమితం చేసుకోవాలని ఎటపాక ఎస్సై చినబాబు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ జాగ్రత్తలు తప్పవని ఎస్సై చినబాబు స్పష్టం చేశారు. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండగల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని , వినాయక విగ్రహాలను ఇళ్లలోనే పెట్టుకోవాలని , బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని , నిమజ్జన ఊరేగింపులు చేయవద్దని ఎటపాక ఎస్సై చినబాబు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కావున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణపతి ఉత్సవాలను ఇండ్లలోనే నిర్వహించాలని , హానికరమైన రంగులను వాడని విగ్రహాలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. వినాయక చవితి రోజున సామూహిక ప్రార్థనలు చేయడంవల్ల ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉంటుంది కనుక కరోనా కట్టడి చర్యలలో భాగంగా పోలీస్ శాఖకు మండల ప్రజానీకం సహకరించాలని ఎస్సై చినబాబు కోరారు. అంతేకాకుండా సీడ్ గణేశా అనే కార్యక్రమం ద్వారా మట్టి వినాయక విగ్రహంలో విత్తనాలను ఉంచడం ద్వారా నిమజ్జనానికి కూడా ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా మన ఇంటిలోనే పూల కుండీలలో విగ్రహాలు నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉందని ఎస్సై చినబాబు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి తమ తమ ఇండ్లలోనే వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని , కాదని బహిరంగంగా నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై చినబాబు హెచ్చరించారు.

 

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు