ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్ పట్టివేత

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఐషర్ వ్యాన్ పట్టివేత
– పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
– ఎటపాక ఎస్సై జ్వాలా సాగర్ వివరాలు వెల్లడి.

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్ ను ఎటపాక పోలీసులు నెల్లిపాక గ్రామం వద్ద పట్టుకున్నారు. ఎటపాక ఎస్సై జ్వాలా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఎటపాక పోలీసులు నెల్లిపాక అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి ఎటపాక మండల పరిధిలోని బండిరేవు , లక్ష్మీపురం మరియు నెల్లిపాక మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు అక్రమంగా టిఎస్ 26 టి 5704 నెంబర్ గల ఐషర్ వ్యాన్ లో 26 పశువులను తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. సదరు వాహనానికి మరియు పశువులకు సంబంధించిన వివరాలు , సరియైన పత్రాలను చూపించకపోవడంతో పశువుల వ్యాన్ ను , ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎటపాక ఎస్సై జ్వాలా సాగర్ పేర్కొన్నారు. పశువులను గోశాలకు తరలించనున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జ్వాలా సాగర్ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు