ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

కాకినాడ రూరల్ ఎండివో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా

కాకినాడ రూరల్ ఎండివో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

కాకినాడ రూరల్ ఎండిఓ ఆఫీస్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మీడియా ప్రతినిధి, మాల కొండయ్య, సెన్సార్ బోర్డ్ మెంబర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ, తొమ్మిదవ తేదీన జరిగిన ఉపాధ్యాయులతో ఎంఈఓ నాడు నేడు కార్యక్రమం పెట్టడం జరిగిందిఅని, ఆ కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయురాలి తో ప్రభు గీతాలు పాటించడం పై, భారతీయ జనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీనిపై సమగ్ర, విచారణ జరిపి ,సీసీ పుటేజ్ లను బయటపెట్టి, ఇప్పటికే దొరికిన వీడియో ఆధారంగా ఎంఈవో ఇచ్చిన వివరణ ఆధారంగా ప్రభు పాటలు పాడినట్లు రుజువై నందున ,వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని అదే కాకుండా ఎవరైతే ఎండివో సరైన వివరణ ఇవ్వకుండా అధికార దర్పం ప్రదర్శించినందుకు వారు కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించినట్లు గా భావించి అలాగే ప్రభు పాటలు పాడుతుంటే అలా చూస్తూ ఉండి పోయారు కాబట్టి వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వ జీతం తీసుకుంటూ అన్యమత ప్రచారాన్ని సాగించేందుకు మీకు అధికారం ఎక్కడిదని, మీరు ప్రభుత్వానికి భరోసా ఇస్తున్నారా లేక వేరే మతాన్ని సపోర్ట్ చేస్తూ పాస్టర్ లు కావాలి అనుకుంటున్నారా మీరే తేల్చుకోవాలి అని,ఫాస్టర్ లు కావాలనుకుంటే మీరు వెంటనే రాజీనామా చేసి మత ప్రచారం చేసుకోవాలని, ఇదే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని అన్నారు, దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని, ఇదే విషయంపై డీఈఓ కు ఫోన్ చేసినా స్పందన కరువైందని ఆయన గురించి కొంతమందిని వివరణ కోరగా ఆయన కూడా ఒక పెద్దఫాస్టర్ గా తెలిసిందని, ఏదిఏమైనా దీనిపై పూర్తి స్థాయిలో సిసి ఫుటేజ్ ను పరిశీలించి వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఇన్చార్జి రేలంగి శ్రీదేవి, మండల అధ్యక్షుడు కాళ్ల ధనరాజు జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ రాష్ట్ర బిల్లింగ్ కమిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ కుండల సాయి కుమార్ కవికొండల భీమ శేఖర్ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం,కొండేటి గంగాధర్ పితాని లీలావతి,పెండెం సత్యనారాయణ, మొసలికంటి సురేష్ గౌతు చిన్నారావు నక్క సతీష్, దిలీప్ కుమార్ ,సదనాని అక్షయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు