ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

పండూరు లో నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కురసాల

పండూరు లో నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కురసాల

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

కాకినాడ రూరల్ మండలం, పండూరు గ్రామంలో జడ్పీ హైస్కూల్ నందు ఉపసర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నాడు-నేడు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి కన్నబాబు పాల్గొని, ఆధునీకరించిన మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాలను
ప్రారంభించి , అనంతరం జగనన్న విద్య కానుక కిట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెస్సింగ్ మరియు మార్కెటింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి విద్యా కానుక తో సీఎం జగన్నన్న మేనమామ అయ్యారన్నారు.నాడు నేడు తో పాఠశాలలకు మహర్దశ పట్టింది అన్నారు. పండూరు గ్రామ ప్రజలకు ఎప్పుడు ఋణ పడి ఉంటాను అన్నారు. ప్రధాన రహదారి సమస్య అయిన రోడ్డు ను త్వరలోనే పనులు ప్రారంభించి,ఆధునికరించి, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎండివో నారాయణ మూర్తి, ఎమ్మార్వో మురళీ కృష్ణ,ఎమ్ ఈవో గణేష్ బాబు, సర్పంచ్ వలవల అమ్మాజీ, వలవల ఎమ్మానియేలు, సొసైటీ నందిపాటిసత్తిబాబు, నంది పాటి ధర్మరాజు, నంది పాటి శ్రీను,బావిశెట్టి వెంకటేశ్వరరావు, గరగ పెదబాబు, అది, ఏ ఎమ్ సి చైర్మన్ గీసాలశ్రీను,బి సి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్,వైసీపీ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, మార్కెట్ డైరెక్టర్ లు రేఖారెడ్డి, లక్ష్మీ, అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ గొల్లపల్లి సతీష్, వేర్ హౌస్ డైరెక్టర్ గంపలరాణి సత్యనారాయణ,వైసీపీ నాయకులుబెజవాడ సత్యనారాయణ, గాంజా సత్తిబాబు,మోకా కృష్ణంరాజు,మాచవరపు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు