ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ప్రెస్,పోలీస్ నకిలీ స్టిక్కర్లపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్

ప్రెస్,పోలీస్ నకిలీ స్టిక్కర్లపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్

నకిలీ స్టిక్కర్లతో పట్టుబడ్డ 138 మంది వాహనదారులు.

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా ఎస్పి ఎం.రవీంద్రనాథ్ బాబు ఆదేశాలకు మేరకు జిల్లా వ్యాప్తంగా వాహనాలపై పోలీసు, ప్రెస్ మరియు ఇతర శాఖల స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై దృష్టి  సారించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
పోలీసుల తనిఖీలలో రోడ్లపై తిరిగే అనేక వాహనాలకు ప్రెస్, పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ల  స్టిక్కర్లు పెట్టుకుని వెళుతుండడం గమనించడం జరిగిందని, నకిలీ స్టిక్కర్లు సృష్టించుకుని వాటిని వాహనాలకు అంటించుకుని రోడ్లపై తిరుగుతున్నారని, ఇలాంటి నకిలీ స్టిక్కర్ల పై దృష్టి పెట్టేందుకు  తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టడం జరిగిందని ఎస్పి తెలియజేసారు. ఈ డ్రైవ్ ను ప్రాధమికంగా ముందస్తు హెచ్చరికలు చేస్తూ నిర్వహించి, తదుపరి అనగా రెండవ సారి చిక్కితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలియజేసారు.

ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో నకిలీ స్టిక్కర్లు గల పోలీస్ డిపార్టుమెంట్ తో సంబంధం లేని 76  మరియు ప్రెస్/మీడియా తో సంబంధం లేని 62 మొత్తం 138 మందిని గుర్తించి వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి, వాహనాలకు ఉన్న స్టిక్కర్లు తొలగించటం జరిగిందని తెలియజేసారు.  ఇకపై వాహనాలపై ఎలాంటి నకిలీ స్టిక్కర్లు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని, స్పష్టం చేస్తూ, జిల్లా పోలీసు శాఖ ద్వారా ఇకపై ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు తరచూ కొనసాగుతాయని,  ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై చట్ట పరంగా చర్యలు తిసుకో బడతాయని జిల్లా ఎస్పి తెలియజేసారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు