ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

పి.గన్నవరం హైస్కూల్,కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పి.గన్నవరం హైస్కూల్,కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భవిత కేంద్రం నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి – ఇన్ స్ట్రక్టర్ పై చర్యకు ఆదేశం.

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

నాడు-నేడు కార్యక్రమం క్రింద అభివృద్ది చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేసేందుకు గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించిన పి.గన్నవరం లోని శ్రీమతి సింగమశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా కలక్టర్ సి.హరికిరణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నాడు-నేడు పధకం క్రింద కల్పించిన విద్యా వసతుల సక్రమ నిర్వహణ, ప్రత్యేక సౌకర్యాల అమలు తీరును ఆయన తనిఖీలో పరిశీలించారు. తొలుత ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన భవితా కేంద్రం పరిశీలనలో ఎంత మంది పిల్లలు హజరైయ్యారు, వారికి ఏ సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ అడిగినపుడు కేంద్రం ఇన్ స్ట్రక్టర్ కె.సత్యన్నారాయణ పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే కేంద్రానికి 5గురు విద్యార్థులు వచ్చారని చెప్పి, వారేరని అడిగితే ఇద్దరిని మాత్రమే చూపించడం పట్ల జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిత కేంద్రాన్ని ఆశించిన ప్రయోజనాల కనుగుణంగా సక్రమంగా నిర్వహించనందుకు ఇన్ స్ట్రక్టర్ సత్యన్నారాయణ పై చర్యకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాఠశాలలోని వివిధ విభాగాలను, మరుగుదొడ్లను ఆయన సందర్శించి అక్కడక్కడా చిన్నచిన్న మరమత్తులు పూర్తి కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ స్కూల్ ను ప్రారంభించారని, అందుకు తగిన రీతిలో పాఠశాల నిర్వహణ, ప్రమాణాలు అమలు చేయాలని ప్రధానోపాధ్యుయుడు డి.వి.ఎస్ ప్రసాద్ కు సూచించారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రతతో మంచి వాతావరణం ఉండేలా చూడాలన్నారు. అలాగే స్కూల్ పేరెంట్ కమిటీ కూడా పాఠశాల నిర్వహణ, అభివృద్దిలో చురుకుగా పాల్గొవాలని కోరారు. తదుపరి తరగతి గదులను సందర్శించి పాఠశాలలో సౌకర్యాలు, విద్యా కానుక కిట్లు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్రొత్తగా ఇచ్చిన బ్యాగులు, యూనిఫారంలతోనే అందరూ బడికి రావాలని వారికి జిల్లా కలెక్టర్ సూచించారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సందర్శించిన

పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీ.హెచ్.సీ) జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన ఆస్పత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రోగులకు మందులు పంపిణీ పై కలెక్టర్ వైద్యాదికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అందుబాటు అంశాలను ఆయన పరిశీలించారు. వారంలో రెండు రోజులు గైనాకాలజిస్ట్ సేవలు అందిస్తున్నారని, ప్రస్తుతం పిడియాట్రిస్ట్, లాబ్ టెక్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిహెచ్సి సూపరింటెండెంట్ డా. ఏ.సూర్యనారాయణ జిల్లా కలెక్టరుకు వివరించారు. తదువరి ఆసుపత్రిలోని వివిధ వార్డులు, లేబర్ రూమ్, మరుగుదొడ్లను కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వార్డులో చికిత్స పొందుతున్న మహిళలతో మాట్లాడి, ఆస్పత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సేవలు బాగున్నాయని, గతంలో ఇక్కడే సురక్షితంగా ప్రసవించి మగశిశువును కన్నానని ఆమె తెలిపింది. ఆసుపత్రి పట్ల ప్రజల్లో మంచి నమ్మకం ఉందని, స్థానికంగానే కాకుండా, అమలాపురం, రాజోలు నుండి తనకు తెలిసిన వాళ్లు చాలా మంది వైద్యం కోసం ఇక్కడకు తరలి వస్తున్నారని తెలియజేసింది ఆసుపత్రికి వచ్చిన వారికి సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్యం, రోగులకు అందించే భోజనం నాణ్యత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రి సేవల పట్ల ప్రజలలో సంతృప్తి వ్యక్తం కావడం పట్ల ఆభినందిస్తూ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సేవా దృక్పధంతో ఈ సి.హెచ్.సి అభివృద్దికి అబ్దల్ కలాం పౌండేషన్ సంస్థ అందిస్తున్న నిధులు, సేవలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డిఓ ఎన్.ఎస్.వి.బి.వసంతరాయుడు, స్కూల్ పేరెంట్ కమిటీ చైర్మన్ పి.రాంబాబు, స్థానికి రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు