ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

మహిళలపై దాడులను అరికట్టాలని మహిళా,ప్రజా సంఘాలు బైక్ ర్యాలీ

మహిళలపై దాడులను అరికట్టాలని మహిళా,ప్రజా సంఘాలు బైక్ ర్యాలీ

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

బాలికలు, మహిళలపై రోజు రోజుకు పెరుగుపోతున్న అఘాయిత్యాలను అరికట్టాలని
మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ
బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు ద్విచక్ర వాహనాలపై పాల్గొని మహిళలు,
బాలికలకు రక్షణ
కల్పించాలని, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని నినాదాలతో కలెక్టర్
కార్యాలయం నుండి టు టౌన్, భానుగుడి,
కోకిలా రెస్టారెంట్ ఆనంద భారతీ, మెయిన్ రోడ్డు
మీదగా బాలజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీని పిఆర్ కళాశాల రిటైర్డ్
ప్రిన్సిపల్ భారత లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతలక్ష్మి, ఐద్వా జిల్లా
కార్యదర్శి సిహెచ్ రమణి, ఫోరమ్ ఫర్ ఆర్టిఐ జాతీయ నాయకురాలు లలిత దేవి, కరాటే
మాస్టర్ నాగదేవి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిమషానికి ఒక అత్యాచారం, వందల సంఖ్యలో
గృహ హింస జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ఒక మహిళా పోలీసు
అధికారిపైనే అత్యాచారం, హత్య జరిగిందంటే యావత్తు దేశం సిగ్గుపడాలన్నారు. హైదరాబాదులో
ఆరేళ్ళ బాలికపై అతిక్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా
శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం వచ్చేలా పార్లమెంటులో రాష్ట్ర ఎంపి లు గొంతు
విప్పాలని కోరారు. మాదక ద్రవ్యాలు, మద్యం వల్లే అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస
పెరుగుతున్నా ప్రభుత్వం నియంత్రించడంలో వైఫల్యం చెందిందన్నారు.. తల్లిదండ్రులు పిల్లల్ని
నైతిక విలువలతో పెంచాలని సూచించారు. బాలికలకు చిన్నతనం నుండి మానసిక ధైర్యం
నూరిపోయాలని అన్నారు. మద్యపానం, మాదక ద్రవ్యాలను, అశ్లీల వెబ్ సైట్లను నిషేదించాలని,
ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలని, పాఠశాలలో
కరాటే వంటి ఆత్మరక్షణా తరగతలు నిర్వహించాలని, ప్రాథమిక తరగతుల నుండి బాల బాలికలు
నైతిక విలువలు నేర్పించే పాఠ్యాంశాలు ఉండాలే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు. ఐక్య వేదిక ద్వారా మహిళలపై జరుగుతున్న హింసను ఐక్యతతో అరికట్టడానికి
ముందడుగు వేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సంతోష్ కుమారి,
ఐద్వా నాయకురాలు నాగ వరలక్ష్మి, దుర్గ, స్నేహ, జ్యోతి,కళావతి, తులసి,
జమాతే నూరు జహాన్,
ఇస్లాం హింద్ నాయకులు అహ్మద్, ఇబ్రహిమ్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు కాశి బాలయ్య,
ఎస్ఎస్ఏ నాయకులు టి రాజా, సూరిబాబు, ఐపిబిపి రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు