ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు,కార్య‌క్ర‌మాల్లో పురోగ‌తిపై స‌మీక్షా స‌మావేశం నిర్వహించిన జిల్లా క‌లెక్ట‌ర్

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు,కార్య‌క్ర‌మాల్లో పురోగ‌తిపై స‌మీక్షా స‌మావేశం నిర్వహించిన జిల్లా క‌లెక్ట‌ర్

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

సంక్షేమం, అభివృద్ధి ప‌రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను ముందువ‌రుసలో నిలిపే క్ర‌మంలో ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌య సాధ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం అమ‌లాపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ వ‌ర్చువ‌ల్ విధానంలో ఐటీడీఏ పీవోలు, స‌బ్‌క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌త్యేక అధికారులు, ఎంపీడీవోలు, త‌హ‌సీల్దార్ల‌తో ప్ర‌భుత్వ ప్రాధాన్య ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల్లో పురోగ‌తిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), జేసీ (గృహ‌నిర్మాణం) ఎ.భార్గ‌వ్‌తేజ‌, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌త్యేక అధికారులు తమ ప‌రిధిలోని మండ‌లాల్లో వారానికి క‌నీసం రెండుసార్లు ప‌ర్య‌టించి అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌ల్లో మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చేలా కృషిచేయాల‌న్నారు. ప్ర‌ధానంగా న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు స్థ‌లాల లేఅవుట్ల లెవెలింగ్ పెండింగ్ ప‌నులు, గ్రౌండింగ్‌తో పాటు సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాలపై దృష్టిసారించాల‌న్నారు. డెంగ్యూ, మ‌లేరియా కేసులు పెర‌గ‌కుండా ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అమ‌లుచేయాల‌ని, డెంగ్యూ కేసులు న‌మోదైన ప్రాంతంలో ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచాల‌ని, న‌మూనాల‌ను ల్యాబ్‌ల‌కు పంపించాల‌ని ఆదేశించారు. అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఫ్రైడే-డ్రైడే కార్య‌క్ర‌మాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేయ‌డంతో పాటు సీజ‌న‌ల్ వ్యాధులబారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి సంబంధించి లేఅవుట్లు, స‌చివాల‌యాల వారీగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించి, వాటిని త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించి ఇళ్ల నిర్మాణాలు వేగ‌వంతంగా జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు.
ల‌బ్ధిదారుల‌కు ఎస్‌హెచ్‌జీ లింకేజీ బ్యాంకు రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వైఎస్సార్ బీమా క్లెయిమ్‌ల‌కు సంబంధించి వీలైనంత త్వ‌ర‌గా డాక్యుమెంట్ల అప్‌లోడ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని, ఇందుకు వివిధ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. అవెన్యూ, ఉద్యాన‌, సంస్థాగ‌త‌, బ్లాక్ ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. జేసీ (డీ) కీర్తి చేకూరి.. సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ చ‌ర్య‌లు, ఫీవ‌ర్ స‌ర్వే; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాలు; స‌చివాల‌యాల సేవ‌లు, సిబ్బంది బ‌యోమెట్రిక్ హాజ‌రు, జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం త‌దిత‌రాల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదే విధంగా ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), జేసీ (గృహ‌నిర్మాణం) ఎ.భార్గ‌వ్‌తేజ.. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల గ్రౌండింగ్‌, వైఎస్సార్ బీమా ఈ-కేవైసీ, క్లెయిమ్‌లు త‌దిత‌ర అంశాల‌పై సూచ‌న‌లిచ్చారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వ‌ర‌ప్ర‌సాద్‌, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీఎంవో పీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ఎస్ఈ (పీఆర్‌) ఎం.శ్రీనివాస్‌, జేడీ(హెచ్‌) సూర్య‌ప్ర‌కాశ్‌, డీడీ(ఏ) వీటీ రామారావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు