ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

అసాంఘిక శక్తులపై నిఘా నేత్ర పరిశీలన….

అసాంఘిక శక్తులపై నిఘానేత్రం…..
– గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకై చర్యలు
– అక్రమ మద్యం రవాణా , అమ్మకాల నియంత్రణ
– సచివాలయ మహిళా పోలీసులకు తర్ఫీదు
– చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ఎటపాక మండలంలోని గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న (గ్రామ సంరక్షణ కార్యదర్శులు) మహిళా పోలీసులకు ఓరియంటేషన్‌ తర్ఫీదులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రాజ్యాంగంలోని వివిధ చట్టాలపై పోలీస్ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మహిళా పోలీసులకు చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జి.కృష్ణకాంత్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు , ఎటపాక మండల సరిహద్దు గ్రామాలైన ఎటపాక , పురుషోత్తపట్నం సెయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలో , పురుషోత్తపట్నం కూడలిలో , చెక్ పోస్ట్ వద్ద పరిశీలించారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ , అసాంఘిక శక్తులపై నిఘా, అక్రమ మద్యం రవాణా , అమ్మకాల నిరోధానికి , గ్రామాల్లో మిస్సింగ్‌ కేసుల గుర్తింపు చేయడంలో పాటించాల్సిన పద్ధతుల గురించి మహిళా పోలీసులకు వివరించారు. అంతేకాకుండా దిశా మొబైల్‌ అప్లికేషన్‌ వినియోగం, మహిళా భద్రతపై అవగాహన, మహిళా మిత్ర గ్రూపు ఆవశ్యకత , సోషల్‌ మీడియా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పోలీస్ అధికారులు వివరిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్ పరిశీలించిన నేపథ్యంలో మండల సరిహద్దుల్లోని సమస్యాత్మక ప్రాంతాలైన ఎటపాక , పురుషోత్తపట్నం శివారులో నిఘా నేత్రాల పర్యవేక్షణ త్వరలోనే పోలీస్ శాఖ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై , మందుబాబులపై , అక్రమ మద్యం రవాణాపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్న క్రమంలో వారికి చెక్ పడినట్టేనని పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎటపాక సీఐ ఎం.గజేంద్రకుమార్ , ఎస్సైలు చినబాబు , జ్వాలాసాగర్ మరియు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు