ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఆరు సంవత్సరాల గిరిజన బాలిక బి. చైత్ర పై అత్యాచారం చేసిన నిందితుడిని ఉరి తీయాలి

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో సింగరాయి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల గిరిజన బాలిక బి. చైత్ర పై అగంతకుడు మానభంగం చేసి హత్య చేయడం దారుణమని ఏపీ దళిత జెఎసి సంఘ సభ్యులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మరెన్నడూ జరక్కుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలులోకి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బహుజన ప్రజల జీవితాలాకు న్యాయం చేయాలని కోరుతూ గుర్తుండిపోయేలాగ శిక్షలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు తల్లిదండ్రులకు ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల మాగాని భూమి ఇవ్వాలని , నిందితుడను తీవ్రంగా శిక్షించాలని ఏపీ దళిత జెఎసి డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా జగ్గంపేట ఏపి దళిత జె ఏ సి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తదనంతరం జగ్గంపేట తాసిల్దార్ వై .సరస్వతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ సభ్యులు జుత్తుక.నాగేశ్వరరావు, గోరంట్ల. కుమార్ పాల, ఎడ్ల .సత్తిబాబు, కొత్తపల్లి సంజీవరావు, మోర్త .తాతారావు, సలాది. డేవిడ్, ఏలేటి .నాని బాబు, దిరిశాల. పండు, మందపల్లి. రాఘవ, సాదే. నరేంద్ర ,ఏలేటి .శ్రీను, ముడుపుగట్టి .చిన్నబాబు, కడతి .సతీష్, కుమ్ము కూరు. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు