ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రైతు సమస్యలపై రైతు కోసం తెలుగుదేశం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్:

జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది ట్రాక్టర్లుతో ఇర్రిపాక లో ప్రారంభమైన ఈ ర్యాలీ మామిడాడ ,నరేంద్రపట్నం చేరుకోగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు కిర్లంపూడి గండేపల్లి అప్పలరాజు శోభన్ కుమార్ వచ్చి టాక్టర్ ర్యాలీని అడ్డుకున్నారు. మీకు పర్మిషన్ లేదు కరోనా కారణాల దృష్ట్యా మీరు ఇలాంటి ర్యాలీలు చేయకూడదంటూ అడ్డుకున్నారు. జగ్గంపేట ఎస్ ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ర్యాలీకి వచ్చే ట్రాక్టర్ లను నిలిపి వేయడం జరిగింది. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ మేము రైతుల కోసం శాంతియుతంగా ఒక్కొక్క టాక్టర్ ఒక్కొక్క డ్రైవర్ ను ఏర్పాటు చేసి వెళుతున్నామని మమ్మల్ని అడ్డుకోవద్దని వేడుకున్నారు. లేదంటే జగ్గంపేట వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తామన్నారు. లేదంటే ఎమ్మార్వో ను నరేంద్రపట్నం తీసుకురావాలని అన్నారు. సీఐ సురేష్ బాబు ఉన్నతాధికారులతో మాట్లాడి ఎమ్మార్వో సరస్వతి ని నరేంద్రపట్నం తీసుకొచ్చారు అక్కడ నవీన్ రైతు సమస్యలపై ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ మా నాయకులు చంద్రబాబు లోకేష్ ఆదేశాల మేరకు ఈ ఈ దేశంలోనే కాదు రాష్ట్రం లో కూడా రైతు గడ్డు పరిస్థితిలో ఉన్నాడని రైతు పక్షాన మనం పోరాడాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామని ఒక్క పిలుపు తో జగ్గంపేట నియోజకవర్గం లోని వందలాది ట్రాక్టర్లు వచ్చి మా నాయకుడు జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు . ర్యాలీ ప్రారంభమై మామిడాడ దాటి నరేంద్రపట్నం చేరుకోగానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు .అడ్డుకుని ప్రతి టాక్టర్ దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసి మీ పై కేసులు పెడతామని బెదిరించిన రైతు సమస్యలపై పోరాడుతున్న నవీన్ అండగా ఉంటామని కాబట్టి మీరు ఏం ఏం చేసినా పర్లేదు అని స్వచ్ఛందంగ ముందుకు వచ్చిన. వారందరికీ శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నానని నవీన్ అన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం లో భాగంగా మూడు రోజుల నుంచి పది రోజుల్లో ప్రతి రైతుకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా రైతుల డబ్బులు వేరే విధంగా ఉపయోగించడం చాలా అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్ వి ఎస్ అప్పలరాజు, జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం పోతుల మోహన రావు, చదరం చంటిబాబు, జీను మణిబాబు, నీలాద్రిరాజు, పాండ్రంగి రాంబాబు అడపా భరత్ కుమార్ ,వెలిశెట్టి శ్రీను, అడ బా ల వెంకటేశ్వరరావు, రేఖ బుల్లి రాజు, కాళ్ల దొంగబాబు, తూము కుమార్, ఎర్రం శెట్టి బాబ్జి, అనుకూల శ్రీకాంత్ ,నీలం శ్రీను, కుదప వాసు, ఉంగరాల గణేష్ బోద్ధి రెడ్ల సుబ్బారావు నాలుగు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు