ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

కనీస మద్దతు ధర కల్పించలేని దీనస్థితిలో జగన్ ప్రభుత్వం

కనీస మద్దతు ధర కల్పించలేని దీనస్థితిలో జగన్ ప్రభుత్వం
కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

రైతు పగలనక రాత్రనక కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించలేని దీనస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉన్నదని కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యుడు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతులకు మద్దతుగా నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ట్రాక్టర్ తో ధాన్యం బస్తాలు రోడ్డు మీద వేసి, రోడ్డు మీద వరినాట్లు నాటి పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని డి ఆర్ వో కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రైతులకు మద్దతుగా రైతుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే పోలీసులు చేత అడ్డుకోవడం జగన్ రెడ్డి చేతకానితనమని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవడం జరిగిందని, వైకాపా ప్రభుత్వంలో నెలలు గడుస్తున్నా రైతులకు సొమ్ము అందడం లేదని, వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా తరువాత రైతుల క్రాప్ హాలీడ్ చేపడితే వ్యవసాయశాఖ మంత్రి హేళనగా మాట్లాడం దారుణమని, రైతు బజారు లో 300 షాపు అద్దె ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా తరువాత 4000 అద్దె చేసిన ఘనత వైసీపీ పార్టీకే చెందిందని’
రైతు భరోస కేంద్రాలు వైకాపా దగా కేంద్రాలుగా ఏర్పడ్డాయని, పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం అమలు కాని జగన్ మోస పూర్తి హామీగా మిగిలిపోయిందని, జగన్ రెడ్డి రైతులుకు ఇచ్చింది గోరంత ప్రచారం కొండంతగా ఉందని, నేడు విత్తనాలు ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎరువులు విత్తనాలను కూడా వైకాపా నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని, వ్యవసాయ మంత్రి ఉండి కూడా రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఒమి బాలాజీ, పలివెల రవి అనంత్ కుమార్, తుమ్మల రమేష్, చాపల ప్రశాంతి, రైతు విభాగం ఉపాధ్యక్షులు జొన్నాడ వెంకటరమణ, ఎం.ఏ తాజుద్దీన్, కొల్లా బత్తుల అప్పారావు, అంబటి చిన్నా, గుజ్జు బాబు, ఎస్ కె రహీం, ఎండీ.ఆన్సర్, పసుపులేటి వెంకటేశ్వర్రావు, బంగారు సత్యనారాయణ, గాది శివరామకృష్ణ, మీసాల మధు, చింతలపూడి రవి, కశింకోట చంద్రశేఖర్, జోగా రాజు, విశ్వనాథం, మూగు రాజు, నేలకాయలు సన్నీ, బషీర్, పొంగా బుజ్జి, గోపిశెట్టి బూరయ్య, రెడనం సత్తిబాబు, ఎరిపిల్లి రాము’ పాలిక నాని, గుమ్మల్ల చిన్నా, పెదపూడి కుమార్, కోడూరు పెద్ద, మల్లాడి లోవరాజు, కసుమూర్, సయ్యద్ అలీ, మల్లిపూడి శివాజీ, తాడి శ్రీను, మెంటా రావు, సామంతులు నాగేంద్రకుమార్, గెడ్డం చంద్రశేఖర్, రిక్కా లక్ష్మి, యండమూరి చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు