ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఇంజనీర్స్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి

ఇంజనీర్స్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి
వీసీఆచార్య మొక్కా జగన్నాథరావు

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దేశాభివృద్ధిలో ఇంజనీర్లు పాత్ర ఎంతో కీలకమని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇంజనీర్స్ కృషి చేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని యూనివర్సిటీ కాలేజ్ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో బుధవారం అద్విక2కె21 ఫెస్ట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు, ప్రత్యేక అతిథిగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి.సుధాకర్ బాబు హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఎ.ఐ.సి.టి.ఇ. గుర్తింపును ఈ ఏడాది సాధించామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో భవిష్యత్ ఉందని నూతన ఆవిష్కరణలతో సమాజ హితంగా ఇంజనీర్లు పని చేయాలన్నారు.దేశ భవిష్యత్ మేథావులైన ఇంజనీర్లు చేతుల్లో ఉంటుందని గుర్తు చేసారు. ఇంజనీరింగ్ విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను సమాజంలో అన్వయించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. భారతదేశంలో యువ ఇంజనీర్ల మేథస్సులో నుండి ఉద్భవించిన ఆవిష్కరణలకు రూపాన్నిఇచ్చి పేటెంట్లు సంపాదించాలన్నారు. అన్ని రంగాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు పట్టు ఉండాలని,అన్ని రంగాలను సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలని తెలిపారు. అభివృద్ధి పేరుతో ఇంజనీర్లు చేస్తున్న ప్రయత్నాలు సమాజ హితంగా, పర్యావరణ హితంగా ఉండాలని తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు భవిష్యత్ లో సృజనాత్మక ఆలోచనలతో దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. పోలవరం ఇరిగేషన్ ప్రోజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బి.సుధాకర్ బాబు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ అర్థర్ కాటన్ వంటి గొప్ప ఇంజనీర్లు భారతదేశానికి విశేషసేవలందించారని కొనియాడారు. దేశంలోనే గొప్ప ప్రోజెక్టుగా పోలవరం ప్రోజెక్టు రూపొందించబడుతుందనిజూన్ 2022 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.నేటి ఇంజనీరింగ్ రంగంలోనే ఒక మైళురాయిగా నిర్మాణమవుతున్న పోలవరం ప్రోజెక్టును ప్రతీఇంజనీర్ సందర్శించాలని తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులంతా ఫీల్డ్ విజిట్గా పోలవరం ప్రోజెక్టును వీక్షించి నూతన విషయాలను తెలుసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను సాధించ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అద్విక2కె21లో భాగంగా ఇంజనీరింగ్ కబ్స్ వారిచే గత రెండు రోజుల నిర్వహించిన క్విజ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్,పోస్టర్ ప్రెజెంటేషన్స్, ప్రోజెక్ట్ ఎక్స్పో, ట్రెజర్ హంట్, వకృత్వం వంటి టెక్నికల్ఈవెట్స్ లో విజేయతలైన విద్యార్థులకు అతిథుల చేతుల మీదిగా జ్ఞాపికలను, సర్టిఫికెట్లును అదించారు. అద్విక ఆధ్వర్యంలో వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు, ప్రత్యేకాతిథిగా పోలవరం ఇరిగేషన్ ప్రోజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బి.సుధాకర్ బాబు సన్మానించి అభినందించారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రోజెక్టులను, పోస్టర్ ప్రెజెంటేషన్లును వీసీ,సిఈ పరిశీలించి విద్యార్థులకు శుభాకాక్షలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డా.పి.వెంకటేశ్వరరావు, డీన్ ఆచార్య పి.సురేష్ వర్మ, కన్వీనర్ ఎ.విజయదుర్గ,కోర్సు కోఆర్డినేటర్లు ఎం.బాలకృష్ణ, జె.హనుమంతు, బి.లక్ష్మీ, సి.హెచ్.శ్రీవర్మ, కోకన్వీనర్లు డా.వెంకట్రావు, ఎన్.రాహుల్ పాల్, బి.యానీకెజియా, జి.నీరంజన్ తదితరులు పాల్గొన్నారు.

 

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు