ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 కార్యక్రమం ద్వారా స్వచ్చమైన ఓటరు జాబితాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లాలోని ఓటరు నమోదు అధికారులను (ఈఆర్ఓలు) కోరారు. బుధవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 ప్రక్రియలో భాగంగా రివిజన్ కు ముందు, రివిజన్ సందర్భంగాను చేపట్టవలసిన కార్యక్రమాలపై సమీక్షించి సూచనలు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ జారీ చేసిన పత్యేక సంక్షిప్త సవరణ-2002 షెడ్యూల్ ప్రకారం అన్ని జిల్లాల్లో అక్టోబరు 31వ తేదీ నాటికి ప్రీ రివిజన్ కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరారు. అనంతరం రివిజన్ కార్యక్రమాలలో భాగంగా నవంబరు 1వ తేదీన ఇంటిగ్రేటెడ్ ఓటరు జాబితాల ముసాయిదాలను ప్రచురించి నవంబరు 31వ తేదీ వరకూ వాటిపై క్లెయిములు అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు. నవంబరు 20, 21వ తేదీలలో స్పెషల్ కాంపెయిన్ డేస్ నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు పొందేలా చైతన్యపరచాలని కోరారు. తదుపరి డిశంబరు 20వ తేదీ నాటికి అందిన క్లెయిములు, అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రచురణ ప్రకటించాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ అధికారులను నియమించాలని, ఈఆర్ఓ ల ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అవగాహన, చైతన్యంతో కూడిన ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు స్వీప్ కోర్ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఎన్నికల కమీషన్ అందుబాటులోకి తెచ్చిన ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ గురించి ఓటర్లందరికి తెలిపేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. గతంలో ఎన్నికల నిర్వహణ కొరకు జరిపిన ఖర్చులకు సంబంధించిన రికన్సిలేషన్ సర్టిఫికేట్లు ఈ నెల 30వ తేదీ లోగా సమర్పించాలని తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 క్రింద జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను సిఈఓ కు వివరించి, షెడ్యూల్ ప్రకారం సవరణ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన జిల్లాలోని ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలకు ఆదేశాలు జారీ చేస్తూ ప్ర్రీ రివిజన్ కార్యక్రమాల్లో భాగంగా ఓటరు జాబితాలలోని మల్టిపుల్ ఎంట్రీలు, లాజికల్ దోషాలను సవరించి, బిఎల్ఓ లతో ఇంటింటి సందర్శన ద్వారా జాబితాల పరిశీలన నెలాఖరులోపున పూర్తి చేయాలని ఆదేశించారు. జాబితాలలో జనాభాలో ఓటర్ల నిష్పత్తి, స్త్రీ-పురుష ఓటర్ల లింగ నిష్పత్తి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి వ్యత్యాసాలుంటే చక్కదిద్దాలన్నారు. వివిధ ఫారమ్ ల ద్వారా అందిన క్లెయిములు, అభ్యంతరాలన్నిటిపై ఈ నెల 25వ తేదీ నాటికి పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈఆర్ఓలకు తమ పరిధిలోని ప్రతి బిఎల్ఓ గురించి ప్రత్యక్ష పరిచయం ఉండాలని, సంక్షిప్త సవరణలో భాగంగా క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు నిర్వహిస్తున్న అంశాలను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (హెచ్) ఎ.భార్గవ్ తేజ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, జడ్పి సిఈఓ ఎన్ వివి సత్యన్నారాణ, మెప్మాపిడి శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు