ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

యంత్ర‌భాగ్యంతో రైతుల పంట పండుతోంది

యంత్ర‌భాగ్యంతో రైతుల పంట పండుతోంది

అన్న‌దాత‌కు అండ‌గా వైఎస్సార్ యంత్ర‌సేవ‌

ఆర్‌బీకేల ప‌రిధిలో కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల ఏర్పాటు

పెట్టుబ‌డిని త‌గ్గించి సాగును లాభ‌సాటిగా మార్చేందుకు అవ‌కాశం

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దేశానికి వెన్నెముక రైతు అందుకే రైతు సంక్షేమం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి, త‌క్కువ పెట్టుబ‌డితో అధిక ఫ‌ల‌సాయం పొందేందుకు అన్న‌దాత‌కు అండ‌గా నిలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వ్యవసాయ యంత్ర పరికరాల లభ్యత తక్కువగా ఉండటం, అదే సమయంలో కూలీల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాగుప‌రంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల నుంచి రైతును గ‌ట్టెక్కించేందుకు, డ‌బ్బును, స‌మ‌యాన్ని ఆదా చేసి.. సాగును లాభ‌సాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం వైఎస్సార్ యంత్ర‌సేవ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి, విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తోంది.

గ‌తంలో వ్య‌వ‌సాయ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అమ‌లైన వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు ఎవ‌రో కొంత‌మంది రైతుల‌కే
ద‌క్కేవి. చాలామందికి యాంత్రీక‌ర‌ణ ఫ‌లాలు ఎండ‌మావిగానే ఉండేవి. ఈ ప‌రిస్థితిని స‌మూలంగా మార్చి.. రైతులంద‌రికీ ప్ర‌యోజ‌నం క‌లిగేలా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మార్గ‌నిర్దేశంతో ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని రూపొందించి, స‌రికొత్త రూపంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు భ‌రోసా కేంద్రాల (ఆర్‌బీకే) ప‌రిధిలో రైతు బృందాల ద్వారా కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ)ను అందుబాటులోకి తెచ్చింది.

ఒక్కో గ్రూపులో అయిదుగురు రైతులు:
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం పరిధిలో రైతులకు కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల ద్వారా పవర్ టిల్ల‌ర్లు, రోటోవేటర్లు, కల్టివేటర్స్, స్ర్పేయర్స్ త‌దిత‌ర యంత్ర పరికరాల‌ను రైతులకు రాయితీపై ఇస్తోంది. అయిదుగురు స‌భ్యులుగల ఒక్కో రైతు బృందానికి రూ.15 లక్షల విలువ చేసే యంత్ర పరికరాల‌ను 40 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం, 10 శాతం రైతు గ్రూప్ వాటాతో అందిస్తోంది. గ్రూపు సభ్యులు తమ పనులు పూర్తయ్యాక ఇతర రైతులకు తక్కువ అద్దెకు యంత్ర పరికరాలు ఇవ్వడంవల్ల అందరికీ ప్రయోజనం కలుగుతోంది. ప్రభుత్వం అందించిన యంత్రాల‌ను ఎలా ఉప‌యోగించాలి? ఏవైనా మ‌ర‌మ్మ‌తులు వ‌స్తే ఏం చేయాలి? త‌దిత‌ర అంశాల‌పై మండ‌ల‌స్థాయిలో యువ‌త‌కు శిక్ష‌ణ కార్య‌క్రమాల‌ను కూడా వ్య‌వ‌సాయ అధికారులు నిర్వ‌హిస్తున్నారు.

జిల్లాలో రూ.495.11 లక్షలతో యంత్ర పరికరాలు:
జిల్లాలో ఇప్పటివరకు 123 వైఎస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా సుమారు రూ.495.11లక్షల విలువైన యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో ఉంచారు. కొత్త విధానంలో ప్ర‌భుత్వం అందించిన యంత్ర ప‌రిక‌రాల వ‌ల్ల వ్యవసాయ పనులకు కోవిడ్ సమయంలో కూలీల కొరత సమస్య తీరిందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలిపారు.

రైతుల సంక్షేమం ధ్యేయంగా
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండడంతో పాటు తక్కువ ధరకే నాణ్యమైన యంత్ర పరికరాలను అందిస్తున్న‌ట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా జి.లక్ష్మీ శ అన్నారు. గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాల ప‌రిధిలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో రైతు బృందాల‌కు యంత్ర ప‌రిక‌రాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, వాలంటీర్ల భాగస్వామ్యంతో ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

రూ.20 వేలు ఆదా
శివ కేశవ, రామవరం గ్రామం, జగ్గంపేట మండలం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మా గ్రామంలోని అయిదుగురు సభ్యులు గ్రూపుగా కలిసి శ్రీ శివ కేశవ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. రైతు భరోసా కేంద్రం సిబ్బంది సూచనలు, సలహాల మేరకు రోటోవేటర్ తీసుకున్నాం. నాకు మూడెక‌రాల సొంత భూమితో పాటు మ‌రో మూడెక‌రాలు కౌలుకు చేస్తున్నా. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా, ఇన్‌పుట్ స‌బ్సిడీ, పంట బీమా త‌దిత‌ర ప‌థ‌కాల‌ను అందుకుంటున్నా. ప్ర‌స్తుతం దమ్ము చేయడానికి ఎకరానికి సుమారుగా రూ.3 వేలు రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మాకు అందించిన రోటోవేటర్ యంత్రాన్ని మా పొలాల్లో దమ్ములకు ఉపయోగించడంతో దాదాపు రూ.20 వేలు ఆదా అయింది.

గతంలో ఎంత ప్రయత్నించినా యంత్రాన్ని పొంద‌లేక‌పోయా
పితాని స‌త్యనారాయణ, గంగులకర్రు, అంబాజీపేట మండలం.

నేను దాదాపు ఎనిమిది ఎక‌రాల్లో వరి, కొబ్బరి సాగు చేస్తున్నాను. గతంలో పవర్ టిల్లర్ కోసం ఎంతగానో ప్రయత్నించి విఫ‌ల‌మ‌య్యా. నేడు మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం వారు నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ పై అవగాహన కల్పించడంతో దరఖాస్తు చేసుకున్నాను. దీంతో కొద్ది రోజులకే మా గ్రూపున‌కు వ్యవసాయ పనుల నిమిత్తం పవర్ టిల్లర్ యంత్రాన్ని మంజూరు చేశారు. దీని స‌హాయంతో కొబ్బరి తోట దుక్కు దున్నడానికి, వరి చేను దమ్ములకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. డీజిల్, ఇతర ఖర్చులు పోను ఎకరానికి సుమారుగా రూ.వెయ్యి లాభం వ‌స్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల‌తో చాలా మేలు జ‌రుగుతోంది.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు