ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
బుధవారం, అక్టోబర్ 27, 2021

స్కూల్ అభివృద్ధికి 50వేల చెక్కును ఆదించిన పూర్వ విద్యార్థి

స్కూల్ అభివృద్ధికి 50వేల చెక్కును ఆదించిన పూర్వ విద్యార్థి

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

కాకినాడ రేచర్ల పేట డాక్టర్ బి అంబేద్కర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి స్కూల్ ఉన్నత కు 50వేల చెక్కును అందించడం ఎంతో అభినందనీయమని అడిషనల్ కమిషనర్ నాగ నరసింహం కొనియాడారు
కాకినాడ నగర పాలక సంస్థకు సంబంధించిన మున్సిపల్ స్కూల్ లను అడిషనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు స్కూల్లో మౌలిక సదుపాయాలను పర్యవేక్షిస్తుండగా ఆ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి తన చదువుకు ఎంతో సహాయ పడిన ఆ స్కూలుకు తన వంతు సహాయమును ఇప్పటికీ ఎన్నోసార్లు అందించగా మరోసారి తన చుట్టాల ద్వారా మరొక సహాయాన్ని కమిషనర్ నాగ నరసింహ చేతుల మీదగా యాభైవేల చెక్కును స్కూల్ హెడ్మాస్టర్ లకు అందించడం జరిగింది ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో 1942 1946 సంవత్సరంలో చదివిన పూర్వపు విద్యార్థి నక్క పావన మూర్తి పుట్టిన ఊరుకు చదివిన విద్యా సంస్థకు ఏదో చేయాలనే తపన తో ఇప్పటికే ఒక మైక్ సెట్ ను అందించారని మరల తన చుట్టాల ద్వారా 50 వేలు రూపాయలను చెక్కును అందించడం జరిగిందని ప్రతి ఒక్కరూ తమ ఉన్నత కు సహాయపడిన విద్యా సంస్థకు ఏదో విధంగా సహాయం చేస్తే బాగుంటుందని అన్నారు ఈ చెక్కును స్కూల్ డెవలప్మెంట్ గానీ లేదా విద్యార్థులకు ఉపయోగపడేలా స్కూల్ కమిటీ ఆలోచించి నిర్ణయిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాలి : అదనపు కమిషనర్.

తరగతి గదిలో విద్యార్థులకు అర్ధమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని కార్పొరేషన్ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు సూచించారు. స్థానిక రేచర్లపేట లోని మునిసిపల్ పాఠశాల ను ఆయన సందర్శించారు. కోవిడ్ నేపధ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు , పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు , మౌళిక సదుపాయాల పై ఆయన ఆరా తీసారు. తరగతులకు అదనపు కమీషనర్ వెళ్ళి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో పరిశీలించారు. పాఠ్యపుస్తకంలో ఫేరాగ్రాప్ను విద్యార్థుల చేత చదివించి వాటిలో అర్ధాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా వాటిని కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరగుతుందన్నారు.ఈసందర్భంగా కొందరు విద్యార్థులు చదువులో వెనుకబడిన విషయం గుర్తించి, ఉపాధ్యాయులను సుతిమెత్తగా మందలించారు. అదనపు కమీషనర్ వెంట ఎస్.ఇ. సత్యనారాయణరాజు , డి.ఇ మాధవి , ఏ ఈ రమేష్ బాబు , నగర పాలక సంస్థ విద్యాశాఖ అధికారి గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు