ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

34.3 C
Kākināda
బుధవారం, అక్టోబర్ 27, 2021

స్కిం వర్కర్ల సంక్షేమం కోరుతూ సెప్టెంబర్ 24 దేశవ్యాప్త సమ్మె

స్కిం వర్కర్ల సంక్షేమం కోరుతూ సెప్టెంబర్ 24 దేశవ్యాప్త సమ్మె

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

అంగన్వాడీ, ఆశా, యనిమేటర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు మరియు ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే కార్మికులందరికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కనీస వేతనాలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 24 దేశవ్యాప్త సమ్మె అన్ని మండల కేంద్రాలలో జయప్రదం చేయాలని కోరుతూ జరిగిన స్కిం వర్కర్ల జిల్లా సదస్సులో సీఐటీయూ జాతీయ ఉపాద్యక్షురాలు జి.బేబిరాణి పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు కె.కృష్ణవేణి, ఇ. చంద్రవతి, ఆశా యూనియన్ జిల్లా నాయకులు కె.అన్నామణి, ఎన్.ఈశ్వరి, యనిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఎస్.రత్నం, గండి మేరీ, మధ్యాహ్న పథక కార్మికుల సంఘం జిల్లా నాయకులు ఎం.అమ్మాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి మాట్లాడుతూ,

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనం పేరుతో నామ మాత్రపు వేతనాలు చెల్లిస్తూ భారతీయమాత ప్రతిరూపాలైన స్కిం వర్కర్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ ప్రభుత్వాలే శ్రమ దోపిడీకి పాల్పడుతుంన్నాయని, పైగా చాలిచాలని వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తున్నారని, కుటుంబంలో ఉండే వృద్ధాప్య పింఛన్లు తొలగిస్తున్నారని, పిల్లలకు అమ్మవడి ఇవ్వడంలేదని, ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకుంటున్నారని, భర్త ఆటో డ్రైవర్ అయితే వైస్సార్ వాహన మిత్ర నుండి తొలగించారని విమర్శించారు. తక్షణమే స్కిం వర్కర్లందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ 24 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాతాశిశు మరణాలను తగ్గించడంలో , విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంలో కీలకపాత్ర పోషించిన ఐసీడీస్ నేటికి పధకంగానే కొనసాగుతుందని, ఐసిడీఎస్ ను సంస్థాగతం చేసి అంగన్వాడీలను 4 తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందించాలని డిమాండ్ చేశారు. యనిమేటర్లు 3ఏళ్ల కాలపరిమితి రద్దు చేయాలని, గ్రామ సంఘాల నుండి అందాల్సిన 2 వేలు వేతనం ప్రతీ నెలా అందించాలని కోరారు, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తీసేసి విద్యార్థికి 100 నగదు బదిలీ చేయాలని చేసిన నిర్ణయంవల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం కాబోతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వేడిగా వండిపెట్టీ 30 వేల మంది వంటలమ్మలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మొదటి , రెండవ సమయాల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు కరోనా సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు విధి నిర్వహణలో కరోనా సోకి మరణిస్తే కేంద్రం కరోనా వారియర్స్ కి ప్రకటించిన 50 లక్షలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో ఒక్క ఆశా కార్యకర్త కుటుంబానికి కూడా అందలేదని, ప్రధానమంత్రి చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో కరోనా సోకి చనిపోయిన స్కిం వర్కర్ల కుటుంబాలకు 50 లక్షల ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేయాలని, రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన 27 భారత్ బంద్ లో స్కిం వర్కర్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సంఘం జిల్లా కోశాధికారి దడాల పద్మ, ఎస్తేరు రాణి, అన్నపూర్ణ, గంగారత్నం, మేరీ సమాధానం, వెంకటలక్ష్మి, రాజేశ్వరి, రమణమ్మ, ఆశా యూనియన్ జిల్లా నాయకులు ఎం. వెంకటలక్ష్మి, ధనలక్ష్మి, లోవ కుమారి, లక్ష్మీ, యనిమేటర్ల సంఘం జిల్లా నాయకులు శారద, డి.మేరీ, డి. ఆనంద్, సంతోషి, మధ్యాహ్న భోజన పథక యూనియన్ నాయకులు జి.జయమణి, డి.సుబ్బలక్ష్మి, పి. సుబ్బలక్ష్మి తదితర స్కిం వర్కర్ల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

 

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు