ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

34.3 C
Kākināda
బుధవారం, అక్టోబర్ 27, 2021

సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు మండ‌ల‌స్థాయి ప్ర‌త్యేక అధికారులు

సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు
మండ‌ల‌స్థాయి ప్ర‌త్యేక అధికారులు

జిల్లా క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలను ప‌టిష్టంగా అమ‌లుచేస్తూ ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో ప్ర‌యోజ‌నం క‌ల్పించేందుకు జిల్లాలోని 62 రూర‌ల్ మండ‌లాల‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించిన‌ట్లు క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. ఈ మేర‌కు గురువారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మం కింద అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల ద్వారా అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఫ‌లాలు అందాల‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు కార్యాచ‌ర‌ణ రూపొందించి అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. మ‌న‌బ‌డి నాడు-నేడు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, గ్రామ స‌చివాల‌య సేవ‌లు, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద చేప‌ట్టే ప‌నులు త‌దిత‌రాల‌కు సంబంధించి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు, శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య సాధ‌న‌కు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించామ‌ని తెలిపారు. ఇప్పుడు మండ‌ల స్థాయిలో ప్ర‌త్యేక అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ అధికారులు ఎంపీల్యాడ్స్‌/సీఎస్ఆర్/సీఎండీఎఫ్ కింద చేప‌డుతున్న అన్ని అభివృద్ధి ప‌నుల‌ను కూడా ప‌ర్య‌వేక్షిస్తార‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు