ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

34.3 C
Kākināda
బుధవారం, అక్టోబర్ 27, 2021

ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ దే కీలకపాత్ర

ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ దే కీలకపాత్ర

న్యాయవాది శ్రీలక్ష్మి

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థదే కీలక పాత్ర అని శాసన ,కార్యనిర్వాహక వ్యవస్థల లోపాలను కూడా సరిదిద్ది సమాజాన్ని నడిపించగల శక్తి న్యాయవ్యవస్థ కే ఉందని న్యాయవాది శ్రీలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు తాము చేసే శాసనాలకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రజలకు వ్యక్తిగతంగా లేదా ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వం ఉల్లంఘిస్తే వాటిని గాడిన పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థకు ఇచ్చారన్నారు. కాలం చెల్లిన విధానాల స్థానే న్యాయవ్యవస్థలో కేసుల పరిష్కారానికి తగు చర్యలు అమలు పరుస్తున్నారు అని అన్నారు. అందులో భాగంగానే లోక్ అదాలత్, గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారని శ్రీలక్ష్మి తెలిపారు. అనంతరం వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌరీ శేఖర్ పీవీ రాజేశ్వరి రవిశంకర్ పట్నాయక్, రాఘవరావు, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు