వైసిపి 3వ వార్డు మెంబర్ గా దామెర్ల.రేవతి నామినేషన్ దాఖలు
ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
జిల్లా పరిధిలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి వైసిపి పార్టీ తరుపున 3వ వార్డు మెంబర్ గా వైసిపి సీనియర్ మహిళా నాయకురాలు దామెర్ల.రేవతి శనివారం ఎటపాక గ్రామసచివాలయంలోని నామినేషన్ కేంద్రంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ మేరకు ఎటపాక గ్రామసచివాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు.