VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 11:57 am Posted by : shaikabdulla9733@gmail.com

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ చారిత్రాత్మకం

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని గోకవరం మండల టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పాలాడి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీసీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల్లో బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ధన్యవాదాలు తెలిపారు.