10:30 PM, 3 Wednesday March 2021

44 గంటలకు ముందు ప్రచారం ముగింపు

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పోలింగ్ ప్రారంభ సమయానికి 44 గంటలు ముందుగా ప్రచార కార్యక్రమాలను ముగించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని ఆయన స్పష్టం చేసారు. అవగాహన లేక కొంత మంది తప్పులు చేసే అవకాశం ఉందనిఅందుకోసం అభ్యర్థులకు అవగాహన కల్పించాలని ఎన్నికల అధికారులకు సూచించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచార సామగ్రికివాహనాలు ఉపయోగించుటకుసమావేశాలు జరుపుకొనుటకు అనుమతులు పొందాలని కలెక్టర్ స్పష్టం చేసారు. అనుమతులకు దరఖాస్తు చేసిన తక్షణం మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల లోపల ఎవరికిఎంత మందికి ప్రవేశం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగాసజావుగా నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#