05:18 PM, 14 Thursday January 2021

6న నన్నయ గూడెం క్యాంపస్ లో ప్లెస్మెంట్ డ్రైవ్

– వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం క్యాంపస్ లో ఈ నెల 6వ తేదిన ప్లెస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ ప్లెస్మెంట్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవచ్చునని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. విశ్వవిద్యాలయం సోమవారం దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ 10వ తరగతి నుండి డిగ్రీ, ఐటిఐ, ఎంబీఏ వంటి అన్ని కేటగిరీల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్లెస్మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. ట్రైని కెమిస్ట్ అండ్ జూనియర్ కెమిస్ట్ పోస్టులు 250కి పైగా ఉన్నాయని 2016 నుండి 2020 మధ్య బి.ఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు దీనికి అర్హులని అన్నారు. కెమిస్ట్ అండ్ సీనియర్ కెమిస్ట్స్ 75 పోస్టులు ఉన్నాయని బిఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ఒకటి నుండి మూడు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని చెప్పారు. హెచ్.ఆర్/మార్కెటింగ్ 60 పోస్టులు ఉన్నాయని ఎంబిఏ పూర్తి చేసినవారు దీనికి అర్హులని అన్నారు. 30 ఫిటర్స్ పోస్టులకు ఐటిఐ ఫిటర్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. అలాగే హెల్పర్స్ గా పని చేసేందుకు 10వ తరగతి పాస్/ఫెయిల్ అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అన్ని కేటగిరిల వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లెస్మెంట్ డ్రైవ్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్లెస్మెంట్ డ్రైవ్ కి వచ్చే అభ్యర్థులు 2 ఫోటోలు, రెజ్యూమ్, గుర్తింపుకార్డు, 10, ఇంటర్, డిగ్రి, పీజీ మార్కుల షీట్స్ అన్ని రెండు కాపీల జిరాక్స్ లతో 6వ తేది ఉదయం తాడేపల్లిగూడెం క్యాంపస్ కు హాజరు కావాలని సూచించారు. నన్నయ విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం క్యాంపస్ ప్రత్యేకాధికారి ఆచార్య కొట్టి శ్రీరమేష్ ప్లెస్మెంట్ డ్రైవ్ ను పర్యావేక్షిస్తున్నారని వివరాలకు 9494908090, 9492244455 నెంబర్లును సంప్రదించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ప్రత్యేకాధికారి ఆచార్య కొట్టి శ్రీరమేష్, క్యాంపస్ అధ్యాపకులు జె.కృష్ణంరాజు, ఎం.ఎన్.ఎన్.అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#