VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 11:59 am Posted by : BOMMU DURGARAO

వేళంగి నిత్యానందపురం సెంటర్‌లో ఘనంగా భారీ అన్నదాన కార్యక్రమం… తరలివచ్చిన భక్తులు

Karapa, Kakinada (VISWAM VOICE DESK):

కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. గ్రామంలోని నిత్యానందపురం సెంటర్ మరియు మార్కెట్ సెంటర్లలో వినాయక ఉత్సవాలు అత్యంత కనులవిందుగా జరిగిన విషయం తెలిసిందే.

​ఈ వేడుకల సంబరాలు ముగిసిన సందర్భంగా ప్రతిఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రెండు సెంటర్ల వద్ద సుమారు 3,000 మందికి పైగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

​ఇందులో భాగంగా ఈరోజు నిత్యానందపురం సెంటర్‌లో ఆలయ ధర్మకర్త వెలుగుల లచ్చరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు గ్రామస్తుల ఉమ్మడి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది.

  1. ​ఈ మహా అన్నదానంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. వినాయక స్వామి కృపతో గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు మరెన్నో జరగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.