కాకినాడలో ఘనంగా ఎన్‌సీసీ ఫ్లాగ్ ర్యాలీ

కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): విశ్వం వాయిస్ సిటీ న్యూస్: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 18(ఎ) బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో ఫ్లాగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భానుగుడి సెంటర్‌ నుంచి బోటు క్లబ్‌ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. 18(ఎ) బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ మెనెజెస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ మహమ్మద్ ఆసిఫ్ నాయకత్వంలో...