VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:10 am Posted by : BOMMU DURGARAO

అద్దంపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

కే.గంగవరం మండలం అద్దంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్లలో చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

సెప్టెంబర్ 30న కాకినాడలో నిర్వహించిన థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ విభాగంలో ఈ విద్యార్థులు రాణించారు. అండర్-14 బాలుర విభాగంలో వై.వి.ఎస్. ప్రణీల్, బాలికల విభాగంలో కె.బిందు వెంకట దుర్గ, చక్రవేణి, అండర్-17 బాలికల విభాగంలో కె.గంగ భవాని, అండర్-19 బాలుర విభాగంలో కె.వెంకటేష్, యు.అభిరామ్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వెంకట రమణ తెలిపారు. ఈ విద్యార్థులు అక్టోబర్ 11, 12 తేదీలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగే 70వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు.

రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గంటాల శ్రీ నాగమల్లేశ్వరి, వైస్ చైర్మన్ ఇనకోటి సత్యవాణి, సభ్యులు, పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రదాత దాసరి సత్తిరాజు (పెద్దకాపు), గ్రామ పెద్దలు కొప్పిశెట్టి నారాయణమూర్తి (బుజ్జి) ఆకాంక్షించారు.

  • రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులను మరియు పాఠశాల పీడీ ఎస్కే.అలీమ్ పాషాను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు అభినందించారు.