అద్దంపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): కే.గంగవరం మండలం అద్దంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్లలో చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 30న కాకినాడలో నిర్వహించిన థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ విభాగంలో ఈ విద్యార్థులు రాణించారు. అండర్-14 బాలుర విభాగంలో వై.వి.ఎస్. ప్రణీల్, బాలికల విభాగంలో కె.బిందు వెంకట దుర్గ, చక్రవేణి, అండర్-17 బాలికల విభాగంలో కె.గంగ భవాని, అండర్-19 బాలుర విభాగంలో కె.వెంకటేష్, యు.అభిరామ్...