ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమాన ప్రయాణ అనుభూతి… హైదరాబాద్‌కు టాలెంట్ స్టూడెంట్స్ పయనం
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతిభగల పది మంది విద్యార్థిని విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. విద్యార్థులకు క్షేత్రస్థాయి విజ్ఞానాన్ని అందించడం, వారిలో ఉన్నత ఆశయాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధురపూడి విమానాశ్రయం వెళ్లే ముందు పాఠశాలలో జరిగిన సమావేశంలో రక్ష ఫౌండేషన్ చైర్మన్ తొగరు మూర్తి మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని మరువకుండా...