06:14 PM, 1 Monday March 2021

సమాజ స్ఫూర్తి ప్రధాత అంబేద్కర్

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

భారతదేశం లో బడుగు బలహీన వర్గాలకు ఇతర కులాలతో సమాన హక్కులు కల్పించి పోరాడే అవకాశాలు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని  మండలం తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్ 64వ వర్థంతి ని పురస్కరించుకొని ఆదివారం  ఇరుసమండ గ్రామంలో టీడీపీ ఎస్సీ నాయకులు చినం  బాలవిజయరావు స్వగృహం వద్ద అయన విగ్రహనికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు దంతులూరి శ్రీను రాజు  సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య,  బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దువ్వూరి సురేష్,  టీడీపీ సీనియర్ నాయకులు గంగుమళ్ల వీరభద్రం ,  పలువురు దళిత నేతలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#