మోడరన్ జూనియర్ కాలేజీలో స్ఫూర్తిదాయకంగా కెరీర్ గైడెన్స్ కార్యక్రమం

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): జి.ఆర్.సి. మోడరన్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శనివారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ కె.వి.ఎస్.జి. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన చారిత్రక, వైజ్ఞానిక, భౌగోళిక అంశాలను ఆసక్తికరంగా వివరిస్తూ విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించారు. గణితంలో పలు మెలకువలను బోధించి, పట్టుదలతో కృషి...