VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 11:57 am Posted by : shaikabdulla9733@gmail.com

రాఖీతో మరింత బలపడిన అన్నాచెల్లెళ్ల అనుబంధం

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: రాఖీ పండుగను పురస్కరించుకుని అన్నాచెల్లెళ్ల అనుబంధం మరోసారి వెల్లివిరిసింది. చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కట్టి, జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు. అన్నలు కూడా తమ చెల్లెళ్లకు అండగా ఉంటామని హామీ ఇస్తూ కానుకలు అందించారు. ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగను కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకున్నారు.