RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు-2026 రెండో విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా రామచంద్రపురం మండలంలో ఎన్నికల విధులకు నియమితులైన ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లుగా ఉపాధ్యాయులు బి. శివ గణేష్, ఎ. విశ్వేశ్వరరావు పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. పోలింగ్ నిర్వహణ విధానం, బ్యాలెట్ పత్రాల వినియోగం, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ ఫారాల నిర్వహణ తదితర అంశాలపై వివరంగా శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె. పద్మజ్యోతి, డిప్యూటీ ఎంపీడీవో ఎం. శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పోలింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.