ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాథమిక హక్కులకే ‘గ్రహణం’!
అటకెక్కిన సమాచార హక్కు చట్టం బోర్డులు. రౌతులపూడి అధికారుల తీవ్ర నిర్లక్ష్యం. పేర్లు, ఫోన్ నంబర్లు లేక అయోమయంలో ప్రజలు కాకినాడ , రౌతులపూడి, విశ్వం వాయిస్ న్యూస్: పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ - 2005) ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుకు నోచుకోకుండా నామ్‌కే వాస్తేగా మారుతోంది. ప్రజా ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా నిర్వహించడంలో అధికారులు తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. కాకినాడ జిల్లా **రౌతులపూడి మండల తహశీల్దార్ కార్యాలయంలో**...