07:18 PM, 1 Monday March 2021

తిరువూరు లో భారత్ బంద్

తిరువూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల పిలుపు మేరకు చేపట్టిన భారత్ బంద్ తిరువూరులో విజయవంతంగా కొనసాగుతోంది. సీపీఐ, సీపీఎం నాయకులు తూము కృష్ణయ్య, కొత్తపల్లి సుందరరావు, సుబాని, ఎస్ నాగేశ్వర రెడ్డి, ఎస్వీ భద్రం, ప్రభాకరరావు, ఆకుల రవి, బీ వెంకటేశ్వరరావు ల అధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, దుకాణాలను మూయించారు. ఎటువంటి ఉద్రిక్తతకు దారితీయకుండా ఎస్సై లు సుబ్రహ్మణ్యం, అవినాష్ లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్ సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ, రైతు వ్యతిరేక బిల్లులను రద్దుచేయాలని నినాదాలు చేశారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#