చిన్ని గుండెకు పెద్ద కష్టం…
దాతల చేయూత కోసం ఎదురుచూపులు రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్: వయసు చిన్నది... కానీ ఎదురైన సమస్య మాత్రం చాలా పెద్దది. తూర్పుగోదావరి జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన నేతల రామారావు (రాంబాబు), సంధ్యాదేవి దంపతుల కుమారుడు యశ్వంత్ సాత్విక్ (4) పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల పరీక్షల్లో చిన్నారికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స అవసరమని తేలగా తొలుత చికిత్సకు రూ.6.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు...