వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలంలోని రేఖపల్లి సొసైటీ కార్యాలయం లో సొసైటీ అధ్యక్షులు ముత్యాల మురళి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డిసిసిబి ఛైర్మెన్ ఆనంతబాబు డిసిసిసిబి ఛైర్మన్ పదవి స్వీకారం చేసి సంవత్సార కాలం సందర్బంగా బుధవారం మండల సొసైటీ అధ్యక్షులు ముత్యాల మురళి ఆధ్వర్యంలో వైసిపి మండల కమిటీ సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. దీనిని పురస్కరించుకొని అధ్యక్షులు మురళి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నారని అన్నారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రైతుల పాలిట దేవుడిలా వారి పక్కన నిలుస్తున్నారని పేర్కొన్నారు. మన్యం టైగర్ డిసిసిసిబి ఛైర్మెన్ ఆనంతబాబు ఈ నియజక వర్గ ప్రజలకు వెన్నుముకగా పని చేస్తూ అందరి ఆధారాభిమానం పొందుతున్నారని ఆయన ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందరికి దగ్గరగా వుంటూ అందరి కాస్త, శాఖల్లో పాలు పంచునుకోవడం మనందరి అదృష్టమని అన్నారు. రైతులకు ఏ సమస్య ఉన్న వారికి అన్ని విధాలా సహకరిస్తునందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మండల వైసిపి పార్టీ నుండి తెలియ జేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పదవి కాలం సంవత్సారం కాలం అయినందున ఆయనకు కృతజ్ఞతలు మండల నాయకుల తరుపున, కార్యకర్తలు తరుపున తెలియ పరుస్తున్నామని మండల నాయకులన్నారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్స్ పంచి పెట్టడం జరిగింది. ఈ కార్య క్రమంలో మండల వైసిపి సీనియర్ నాయకులు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మాచర్ల గంగులు, వైసిపి నాయకులు మామిడి రమణ , మండల కన్వీనర్ పోడియం గోపాల్, మాదిరెడ్డి సత్తిబాబు, ముత్యాల శ్రీను, ముత్యాల గౌతం, చిక్కాల బాలు, బొడ్డు సత్యనారాయణ, రెడ్డి మల్ల శ్రీను,పిట్ట రామారావు, వెంగళరావు కాంతారావు ,కోట్ల శ్రీను పాల్గొన్నారు.