రెడ్డి రాధాకృష్ణ....
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య విద్య ను ప్రైవేటికరణ నిర్ణయన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ నిర్ణయం పేద విద్యార్థులకు శాపమని వైసిపి రైతు విభాగ రాష్ట్ర కన్వీనర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ రాజబాబు అన్నారు.మండపేట పట్టణంలో 6వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ చేయడం తో పేదలకు వైద్య విద్య అందదన్నారు. పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశం ఉండదని చెప్పారు.పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక ఆరో...
నవ భావి భారత విద్యార్థులే రేపటి పౌరులు...
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని జవహర్ లాల్ నెహ్రు వాక్కు అక్షర సత్యమని మండపేట అక్షర స్కూల్ హెడ్ మాస్టారు,డైరెక్టర్ వంక రాంబాబు, బొప్పన వెంకట్రావు పేర్కొన్నారు. మండపేట పట్టణం గొల్లపుంత రోడ్డులో ఉన్నా అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం స్కూల్ ఆవరణలో డైరెక్టర్ వంక రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, అటు చదువు లోను ఇటు సామజిక అంశాలలోను ఎప్పటి కప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకోవాలని అన్నారు.బొప్పన వెంకటరావు మాట్లాడుతూ మన...
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్,అడ్వకేట్ వేగుళ్ల రామ్మోహన్ రావు గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యాయవాదిగా విశిష్ట సేవలందిస్తున్న రామ్మోహన్ రావు మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ యరమాటి వెంకటరాజు, మామిడి శ్రీను,టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్మాన్ హుస్సేన్,టిడిపి పట్టణ అధ్యక్షులు మచ్చా నాగు, మెకానిక్ కరీం,...
ద్వారపూడి గ్రామ వైఎస్ఆర్సీపీ నూతన కమిటీ నియామకం…
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, పి.ఏ.సి కమిటి మెంబర్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులతో సమావేశమై నూతన కమిటీని నియమించడం జరిగింది. గ్రామ అధ్యక్షునిగా యరగతపు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా సత్తి సత్తిబాబు, కొమరపు సంజీవ లను నియమించారన్నారు. ప్రధాన కార్యదర్శులుగా నామాల పెద్ద వెంకన్న, చింతలపూడి ఈశ్వరుడు, తలాడి గౌరీ నాయుడు, తాండ సత్తిబాబు, మహమ్మద్ అమీర్, బడుగు రాజు లతో పాటు కార్యదర్శులు గా యాతం వీరభద్రరావు, సుబ్బరాజు, కొత్త వీరభద్రరావు, గుర్రాని శ్రీను, కేవీ రమణ, పైడిమల్ల గౌతమ్, పుట్టపూడి...
పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి...
తణుకు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు చుండ్రు ప్రకాష్...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, మండపేట
కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు చేసే ఆసత్య ప్రచారాలు తిప్పికొడుతూ,తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త నడుచుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్, తణుకు నియోజకవర్గ టిడిపి పరిశీలకులు చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రం తణుకులో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తణుకు ఎమ్మెల్యే ఆరుమీల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాష్ తో పాటు ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్, టిడిపి జోనల్...
అంచనాల కమిటీ చైర్మన్,ఎమ్మెల్యే వేగుళ్ళ...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట రావులపేట లో ఉన్న రావుల చెరువు అభివృద్ది కి కృషి చేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.మండపేట పురపాలక పరిధిలో 19వ వార్డులో గల రావులపేట చెరువును రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ , మున్సిపల్ కమీషనరు శ్రీ టి.వి. రంగారావు లతో కలిసి సందర్శించారు. రావులపేట చెరువును అభివృద్ధి చేసేందుకు వెంటనే సంబంధిత అంచనాలు తయారు చేయాలని మున్సిపల్ కమీషనరు ను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్ నాయకులు జొన్నపల్లి సూర్యారావు, కొవ్వాడ...
ఎంపీఎస్ వార్షిక క్రీడా పోటీల ప్రారంభోత్సవం లో సీఐ సురేష్...
విశ్వం వాయిస్ స్పోర్ట్స్ డెస్క్, మండపేట
ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థలు నిర్వహించే వార్షిక క్రీడా పోటీలను సీఐ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు ఆవిష్కరించగా స్కూల్ జెండాను సీఐ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు అత్యంత ఆకర్షణీయంగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి సీఐ కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన క్రీడా జ్యోతిని వెలిగించారు. జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తన చిన్నతనంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారమని, ఇప్పుడు కూడా...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పుర పాలక సంఘం కమిషనర్ టివి రంగారావు పేర్కొన్నారు.మండపేట పురపాలక సంఘం లో స్టాండింగ్ కౌన్సిలుగా 1 జనవరి 2026 నుంచి 31 డిసెంబర్ 2028 వరకు మూడేళ్లు పనిచేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965, జి.ఓ.ఎం.ఎస్.నెం.706, ఏం ఏ అండ్ యూ డి తేదీ 03-08-1968 లోని నిబంధనలకు అనుగుణంగా షరతుల మేరకు స్థానిక బార్ అసోసియేషన్ సభ్యుల నుండి ధరఖాస్తులు కోరారు. ధరఖాస్తులు ఈ నెల 22 లోగా మండపేట పురపాలక సంఘ కార్యాలయనికి అందజేయలన్నారు.ధరఖాస్తుదారు బార్ అసోసియేషన్ లో 7 సంవత్సరాలు మించి సభ్యత్వం కలిగియుండాలన్నారు.ధరఖాస్తుదారుకు 60 సంవత్సరాలు...
రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్, వాసంశెట్టి సత్యం
విశ్వం వాయిస్ న్యూస్, ద్రాక్షారామ
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనకాడబోదని ఎన్డీఏ కూటమి, తేదేపా సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామంలో సోమవారం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. దీనికిగాను రామచంద్రపురం నియోజవర్గం లో 62...
మండపేటను రాజమహేంద్రవరం లో కలపాలనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన వేగుళ్ల...
వేగుళ్ల ఇంట సందడి చేసిన వేగుళ్ళ...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కలపడం తో ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లు వైసిపి సీనియర్ నేత, జేఏసీ సభ్యులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి అన్నారు. శనివారం ఎమ్మెల్యే వేగుళ్ళ స్వగృహంలో వేగుళ్ళ ను కలిసి అభినందించారు. పలువురు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి కి చేరుకుని ఆయన్ను పూలమాలలు, దుస్సాలవాలతో అభినందనల వెల్లువ కురిపించారు.మండపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఎమ్మెల్యే వేగుళ్ళ నివాసానికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపారు. కేవలం వేగుళ్ళ కృషి తోనే...