విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్,అడ్వకేట్ వేగుళ్ల రామ్మోహన్ రావు గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యాయవాదిగా విశిష్ట సేవలందిస్తున్న రామ్మోహన్ రావు మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ యరమాటి వెంకటరాజు, మామిడి శ్రీను,టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్మాన్ హుస్సేన్,టిడిపి పట్టణ అధ్యక్షులు మచ్చా నాగు, మెకానిక్ కరీం,...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పుర పాలక సంఘం కమిషనర్ టివి రంగారావు పేర్కొన్నారు.మండపేట పురపాలక సంఘం లో స్టాండింగ్ కౌన్సిలుగా 1 జనవరి 2026 నుంచి 31 డిసెంబర్ 2028 వరకు మూడేళ్లు పనిచేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965, జి.ఓ.ఎం.ఎస్.నెం.706, ఏం ఏ అండ్ యూ డి తేదీ 03-08-1968 లోని నిబంధనలకు అనుగుణంగా షరతుల మేరకు స్థానిక బార్ అసోసియేషన్ సభ్యుల నుండి ధరఖాస్తులు కోరారు. ధరఖాస్తులు ఈ నెల 22 లోగా మండపేట పురపాలక సంఘ కార్యాలయనికి అందజేయలన్నారు.ధరఖాస్తుదారు బార్ అసోసియేషన్ లో 7 సంవత్సరాలు మించి సభ్యత్వం కలిగియుండాలన్నారు.ధరఖాస్తుదారుకు 60 సంవత్సరాలు...
వెల్లువలా సాగిన దేశభక్తి విద్యార్థులకు వివరించిన అధికారులు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
దేశంలో స్వతంత్ర కాంక్షను రగిలించిన వందేమాతరం గేయం బక్కిం చంద్రనాద్ చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు దేశంలో పలుచోట్ల వందేమాతరం గీతాలాపన జరిగించారు.
* వందేమాతర గేయం చరిత్ర
కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1866 సంవత్సరం లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి సారి వందేమాతరం గీతాన్ని ఆలపించగా, అప్పటినుండి వందేమాతరం పాడడం ఒక సంప్రదాయంగా మారింది. బ్రిటిష్ వారి పై తిరుగుబాటు ఉద్యమాలలో వందేమాతరం గీతాన్ని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదిస్తూనే తెల్ల దొరలను ఎదురించారు. అంత గొప్పస్పూర్తిని, ఉద్యమకాంక్షను రగిలించిన శక్తిమంతమైన జాతీయ గీతం వందేమాతరం....
మండల వ్యాప్తంగా 170 చేనేత కార్మికుల కుటుంబాలకు సహాయం
గ్రామంలో 56 కుటుంబాలకు సరఫరా చేసిన కూటమి నాయకులు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
ఇటీవల రాష్ట్రంలో అలజడి సృష్టించిన మొంథా తుఫాను తీవ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందోంచడం తో పాటు, తుఫాను తీవ్రత వలన జీవనోపాధి కి ఆటంకం ఏర్పడిన చేనేత ,మత్స్యకార కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూత నందిస్తూ, సహాయంగా ప్రకటించిన నిత్యవరాలను కూటమి కార్యకర్తలు,లబ్దిదారులకు గురువారం అందించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో స్థానిక శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశాల మేరకు చేనేత కార్మికులకు నిత్యావసర...
ఘనంగా రాయవరం మునసబు 36 వ వర్థంతి కార్యక్రమం
డిల్లీ నుండి గల్లీ వరకూ రాజకీయం లో సిధ్ధహస్తం
రాయవరం లో అభిమానుల ఘన నివాళులు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
దాతృత్వం తో ఎందరో అభాగ్యులకు తమ సొంత స్ధలాలను ఇళ్ళ కొరకు దానమివ్వడమే కాక, అనేకులు విద్యావంతులుగా మారడానికి పాఠశాలలు, కళాశాలలను స్థాపించి ప్రోత్సహించిన, రాయవరం మునసబు, వుండవిల్లి సత్యనారాయణ మూర్తి 36 వ వర్ధంతిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గురువారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. వెదురుపాక తాలూకా రాయవరం గా పిలవబడే గ్రామాన్ని, మునసబు గారి రాయవరం అనేలా తన ప్రత్యేకతను చాటడమే కాక, గల్లీ నుండి ఢిల్లీ వరకూ రాజకీయం చేయడం లో...
అధ్యక్షత వహించిన కమిటి చైర్మన్ తోట...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సచివాలయంలో సభార్డినేట్ లెజిస్లేషన్ కమిటి సమావేశం గౌరవ చైర్మన్ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును 12 మంది సభ్యులతో కూడిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే, బుధవారం ఉదయం తొలిసారిగా సమావేశమైన కమిటి లో 16 వ శాసనసభ 2వ, 3వ, 4వ సమావేశంలో సభ సమక్షంలో ఉంచిన గవర్నమెంట్ ఆర్డర్లు, రూల్స్ మరియు నోటిఫికేషన్స్ పై కూలంకుషంగా చర్చించారు తదుపరి సమావేశంలో శాఖలవారీగా సమీక్షలు జరుపుతామని తెలిపారు. ఈ మీటింగ్ లో కమిటి అసిస్టెంట్ సెక్రటరీ వేమూరి విశ్వనాథ్,...
విజ్ఞాన్ లో విద్యాబోధన తో విద్యార్థుల మనసుల్లో సుస్థిర స్థానం
ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు
అభినందనలు తెలిపిన విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్, అడ్వైజర్
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
విద్యార్ధులకు ఉత్తమ బోధనలు చేసి వారి మనసులో సుస్థిర స్థానం సంపాందించిడం మధురమైన జ్ఞాపకం అని విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేషవేణి పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలోని విజ్ఞాన్ విద్యా సంస్థలలో విద్యా బోధన చేయడమే కాక, తన ప్రవర్తన, వినయం తో విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచిన సత్తి తేజా సుస్మిత రెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం మరొక ప్రాంతానికి తరలివెళ్తున్న సందర్భంగా శనివారం ఆమెకు విద్యాసంస్థల తరపున ఘనంగా అభినందన కార్యక్రమం...
హాజరైన పట్టణ ప్రముఖులు...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట పట్టణం కె.పి రోడ్డులో శ్రీ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ హాస్పిటల్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ ఆరంభ కార్యక్రమానికి పట్టణంలో పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఆత్యాధునిక వైద్య పరికరాలు పరిశీలించి అందించే వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. హాజరైన అతిధులందరికి శ్రీ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఐ ఎన్ వి విశ్వనాథ్, డాక్టర్ ఐ జ్యోతిర్మయిలు దుస్సాల్వ లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలా కృష్ణ, మాధవి ఆయిల్స్, మాధవి స్పోర్ట్స్ క్లబ్ అధినేత వేగుళ్ళ...
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మనుమడు, వైస్సార్సీపీ మండపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు చోడే శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర కార్యదర్శి, కో ఆప్షన్ మెంబర్ రెడ్డి రాధాకృష్ణ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మయూరి వృద్ధాశ్రమం, గవర్నమెంట్ ఆసుపత్రి నందు శ్రీకృష్ణ మిత్రుడు గాలీదేవర బాబీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తదుపరి ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ సంస్థ నందు వృద్ధులకు వేమగిరి శేఖర్, దుగ్గిరాల రాంబాబు ఆధ్వర్యంలో అన్నదానం, దుప్పట్లు పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో సొసైటీ మాజీ...
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల కు విజ్ఞాపన తెలిపిన వెంకటేశ్వరరావు
సోషల్ మీడియా వేదికగా వరమిచ్చిన ఐటీ శాఖ మంత్రి లోకేష్
సంభ్రమాశ్చర్యానికి గురైన చెల్లూరు కు చెందిన దివ్యాంగుడు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
తనకు బ్యాటరీ వాహనం ఇప్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసిన దివ్యాంగుడి కి సొంత ఖర్చులతో బ్యాటరీ వెహికల్ ను ఇంటికి పంపిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ఇటీవల కాలంలో పాలకొల్లు నియోజకవర్గం లో పర్యటనలో ఉన్న రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను ఆటోలో వెళ్లి కలిసారు. ఆయనతో వెంకటేశ్వరరావు...