నవంబర్ 5న ఛలో విజయవాడ: ప్రభుత్వ తీరుపై కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమర శంఖం
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): గత ఇరవై ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని తమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ జేఏసీ ప్రభుత్వంతో అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ, వచ్చే నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉద్యోగులతో కలిసి భారీ పోరాటానికి దిగనున్నట్లు జేఏసీ ప్రకటించింది. జేఏసీ రాష్ట్రవ్యాప్త ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా రాజమండ్రిలోని రమణం శ్రీరాములు కల్యాణ మండపంలో జరిగిన మొట్టమొదటి మహాగర్జన సదస్సులో ఈ హెచ్చరిక వెలువడింది....