ByGanesh
Tue 12th Nov 2024 11:37 AM
ఆచార్య తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన కొరటాల శివ కు దేవర చిత్రం బిగ్ రిలీఫ్ నిచ్చింది అనే చెప్పాలి. ఆచార్య తర్వాత కొరటాల సర్వైవ్ అవుతారా అనే అనుమానం చాలామందిలో మొదలైంది. ఎన్టీఆర్ కి కొరటాల ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అని ఎన్టీఆర్ ఫాన్స్ టెన్షన్ పడని రోజు లేదు. మొదటి రోజు దేవర టాక్ చూసాక కొరటాల పనైపోయింది అనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ స్టామినా దేవర ని సక్సెస్ తీరం వైపు నడిపించింది. ఎన్టీఆర్ సత్తా కొరటాల దర్శకత్వ లొసుగులను డామినేట్ చేసింది. దానితో కొరటాల ఆచార్య డిజాస్టర్ మరక నుంచి బయటపడ్డారు. మరి ఇప్పుడు దర్శకుడు శంకర్ వంతు. శంకర్ ఇండియన్ 2 తో రీసెంట్ గానే బిగ్గెట్స్ డిజాస్టర్ చవి చూసారు.
మరి రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ తో శంకర్ సర్వైవ్ అవుతారా.. ఇండియన్ 2 మరక ను తుడిచేసుకుంటారా.. రీసెంట్ గా విడుదలైన గేమ్ ఛేంజర్ టీజర్ పాన్ ఇండియా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక సినిమా రిజల్ట్ ఏమిటో, శంకర్ గేమ్ ఛేంజర్ తో గట్టెక్కుతారా అనేది ఇపుడు క్యూరియాసిటీగా మారింది.
Koratala is safe.. and what will Shankar do?:
Game Changer What will Shankar do?