కరపలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు
కరప, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను అత్యంత పకడ్బందీగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని కరప మండలం చంద్రన్న సమావేశ మందిరంలో శుక్రవారం ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం రెండో వారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పి. వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి...