VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 10:30 pm Posted by : Chandu

చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘన సత్కారం

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

500కు పైగా మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులకు సన్మానం

గ్రామ మాజీ సర్పంచ్ పాలింగి చినబాబు, బక్కి సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయవరం గ్రామ మాజీ సర్పంచ్ పాలింగి చినబాబు (బుజ్జి), యువ నాయకుడు బక్కి సందీప్ ఆధ్వర్యంలో రాయవరంలోని వి.ఎస్.ఎం. కళ్యాణ మండపంలో ఆదివారం విద్యార్ధులకు ఘనంగా సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరంలో  గల  శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి,  2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ జి.ఎస్.ఎన్. రెడ్డి, పారిశ్రామికవేత్త తేతలి సుబ్బిరామిరెడ్డి, డాక్టర్ టీ. నవీన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన కృషిని కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, టీడీపీ నాయకులు తమలంపూడి గంగాధరరెడ్డి, కోటరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అచ్చుతరామరాజు, పడాల కమలారెడ్డి, పులగం శ్రీనివాస్‌రెడ్డి, తాడి రామచంద్రరెడ్డి, వెలగల ఫణికృష్ణరెడ్డి, సాయితేజ స్కూల్ అధినేత కర్రీ సందీప్‌రెడ్డి, విజ్ఞాన్ కాలేజీ డైరెక్టర్ అమ్మిరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు పోలిమాటి సుధాకర్, బీజేపీ నాయకులు నల్లమిల్లి రామకృష్ణరెడ్డి, దళిత నాయకులు గొట్టి సూరిబాబు, కచ్చా రాజశేఖర్, నేతల చంద్రశేఖర్ (చంటి), గండి చంద్రశేఖర్ తదితరులు పాల్గొని, మాజీ సర్పంచ్ చినబాబు (బుజ్జి), బక్కి సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని అభినందించారు.